
బుల్లెట్ తీసి బతికించారు..
గచ్చిబౌలి: సోమాలియా దేశంలో జరిగిన సివిల్ వార్‌లో ఓ యువకుడికి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కోమాలోకి వెళ్లిన యుకుడికి బుల్లెట్‌ను తీసేందుకు అక్కడి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండు నెలల అనంతరం రోగిని ఎయిర్ అంబులెన్స్‌లో గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. 12 గంటల పాటు శస్త్ర చికిత్స చేసిన కేర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం 3.5 సెంటీ మీటర్ల పొడవు ఉన్న బుల్లెట్‌ను బయటకు తీసింది. దీంతో సదరు యువకుడు గులెమ్ మహముద్ హెర్సీ(27) ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. గురువారు కేర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ లక్ష్మీనాథ్ శివరాజు వివరాలు వెల్లడించారు. సోమాలియాకు చెందిన గులెమ్ మహమూద్ హెర్సీ అనే యువకుడికి అక్కడ జరిగిన సివిల్ వార్‌లో నుదుటి నుంచి బుల్లెట్ తలలోకి దూసుకెళ్లిందన్నారు. చిన్న మెదడు దగ్గర చేరడంతో అతడు కోమాలోకి వెళ్లాడని, అక్కడి వైద్యులు తల ముందు పుర్రె ముందు భాగం నుంచి బుల్లెట్‌ను తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. కోమాలోంచి కొద్దిగా కోలుకున్న తర్వాత అతడిని రెండు నెలల అనంతరం ఎయిర్ అంబులెన్స్‌లో గచ్చిబౌలి కేర్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారన్నారు. రేడియాలజీ, సిటీస్కాన్, ఎంఆర్‌ఐలో బుల్లెట్ పొజిషన్, లోకేషన్‌ను గుర్తించామన్నారు. న్యూరో నావిగేషన్, సర్జికల్ మైక్రో స్కోప్ ద్వారా బ్రెయిన్ ఫంక్షన్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 12 గంటల పాటు ఆపరేషన్ చేసి బ్లీడింగ్ కాకుండా, వైటల్ స్టక్చర్స్‌ను కాపాడుకుంటూ బుల్లెట్‌ను తీశామన్నారు. బ్రెయిన్ స్టెంట్ దగ్గర ఉన్న బుల్లెట్‌ను బయకు తీయడం చాలా అరుదుగా జరుగుతుంటుందన్నారు. సర్జరీ జరిగి రెండు వారాలు గడిచిందని, రోగి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అతడిని రిహాబిలిటేషన్ సెంటర్ ఉంచామని, మరో నాలుగు వారాలు గడిస్తే మరింత కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. కేర్ హాస్పిటల్స్ సీఈఓ నీలేష్ మాట్లాడుతూ ఇలాంటి క్లిష్టమైన కేసులకు అత్యాధునిక వైద్య సదుపాయాలు , నిపుణులైన వైద్యులు తమ వద్ద ఉన్నారని తెలిపారు. ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాల నుంచి వచ్చే అందర్జాతీయ రోగులకు గమ్యస్థానంగా కేర్ హాస్పిటల్ ఉందన్నారు.
రెండు నెలలకు పైగా తలలో బుల్లెట్
గచ్చిబౌలి కేర్ హాస్పిటల్‌లో
అరుదైన శస్త్ర చికిత్స
3.5 సెంటీ మీటర్ల బుల్లెట్‌ను
బయటకు తీసిన కేర్ వైద్యులు
సురక్షితంగా బయటపడ్డ
సోమాలియా యువకుడు