
పల్లెలన్నీ బీజేపీ వెంటే..
కుల్కచర్ల: బీజేపీ విధానాలు.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు హర్షిస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కరణం ప్రహ్లాదరావు, టెలికం అడ్వైజరీ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఘనపురం వెంకటయ్య అన్నారు. గావ్ చలో–శ్రీబస్తీ చలో కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండల పరిధిలోని బొంరెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజలంతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను, హామీల అమలులో విఫలమవుతున్న తీరును పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో దిశ జిల్లా కమిటీ సభ్యుడు జానకీరాం, పార్టీ చౌడాపూర్ మండల ప్రధాన కార్యదర్శి హన్మంతు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు అంజిలయ్య, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ప్రహ్లాదరావు