
సుపరిపాలనలో చీమల్‌దరి బెస్ట్
ఉత్తరప్రదేశ్, కేంద్ర బృందంసభ్యుల కితాబు
మోమిన్‌పేట: సుపరిపాలనలో చీమల్‌దరి గ్రామం ఆదర్శంగా ఉందని ఉత్తరప్రదేశ్ అధికారులు, కేంద్ర బృందం సభ్యులు కితాబునిచ్చారు. మంగళవారం 24 మంది సభ్యులతో కూడిన బృందం గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, రోడ్లు, భూగర్భ మురుగు కాల్వల నిర్మాణం, ప్రజలకు పంచాయతీ నుంచి అందుతున్న సేవలు, పన్నుల వసూలు, వీధి దీపాల ఏర్పాటు తదితర వాటిని పరిశీలించారు. మారుమూల గ్రామం ఇలా అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. గ్రామస్తుల సహకారం, పంచాయతీ పాలకవర్గం పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. సుపరిపాలనలో గ్రామానికి జాతీయ అవార్డు రావడం చాలా గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, డీఎల్‌పీఓ సంధ్యారాణి, ఎంపీఓ యాదగిరి, పంచాయతీ కార్యదర్శి సుగుణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై
సీఎం ప్రత్యేక దృష్టి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి
బొంరాస్‌పేట: ప్రభుత్వ పాఠశాలలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఏర్పుమళ్ల ప్రాథమికోన్నత పాఠశాలలో మహిళా సంఘాలకు విద్యార్థుల యూనిఫాంకు సంబంధిచిన క్లాత్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, భోజనం, ఏకరూప దుస్తులు అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరింత ప్రగతి ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రాములు గౌడ్, జయకృష్ణ, మల్లేశం, రాంచంద్రారెడ్డి, అంజిల్‌రెడ్డి, మల్లికార్జున్, హెచ్‌ఎం వెంకట్‌రెడ్డి, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాల భర్తీకి
దరఖాస్తుల ఆహ్వానం
తాండూరు రూరల్: మండలంలోని జినుగుర్తి గేటు వద్ద గల గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ విజయ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ (డాటా ఎంట్రీ ఆపరేటర్) ఒక పోస్టు, ఆఫీస్ సబార్డినేట్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఏదైన డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్స్ పూర్తి చేసిన సర్టిఫికెట్ ఉండాలన్నారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు పదో తరగ తి ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 15వ తేదీలోపు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ మానస హి ల్స్ వద్ద ఉన్న గిరిజన గురుకుల ప్రధాన కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రేపు జాబ్‌మేళా
జిల్లా ఉపాధి కల్పనాఽధికారి సుభాన్
అనంతగిరి: శ్రీ మంత్ర టెక్నాలజీ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం ఈనెల 10న వికారాబాద్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సుభాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. ఎంపికై న వారికి ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఉదయం 10.30గంటలకు పట్టణంలోని ఐటీఐ కళాశాల ఆవరణలో జాబ్‌మేళా ఉంటుందన్నారు. నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సుపరిపాలనలో చీమల్‌దరి బెస్ట్

సుపరిపాలనలో చీమల్‌దరి బెస్ట్