పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
నవాబుపేట: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని చించల్‌పేట గ్రామంలో గురువారం సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రేషన్ షాపుల్లో పంపిణీ చేసే బియ్యాన్ని ఎవరు కూడా సక్రమంగా తినేవారు కారన్నారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సన్న బియ్యం పేదల పాలిట వరం..
దుద్యాల్: ప్రతిఒక్కరూ సన్న బువ్వ తినాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని హస్నాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూర్పు భీములు, జిల్లా కార్యదర్శి దౌల్తాబాద్ మల్లేశ్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని హస్నాబాద్‌లో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సన్న బియ్యంతో అన్నం తినాలంటే పెద్ద రైతు, ఆర్థికంగా స్థోమత ఉన్నవారే తినేవారన్నారు. పేదలు, సామాన్యులు కూడా సన్న బియ్యం వండుకుని తినాలనే ఉద్యేశ్యంతో ప్రభుత్వం అందరికీ పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ వెంకటేశ్, గ్రామస్థులు వెంకటయ్య, నరేశ్, రాజు, చంద్రప్ప, వెంకట్ ప్రసాద్, మైమూద్, నర్సిములు, వెంకటయ్య, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య


