విద్యుత్‌ సరఫరాలో అంతరాయం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

Apr 10 2025 7:11 AM | Updated on Apr 10 2025 7:11 AM

విద్య

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

కొడంగల్‌ రూరల్‌: కొడంగల్‌ సబ్‌స్టేషన్‌ 33కేవీ లైన్‌ మరమ్మతుతోపాటు మెయింటెన్స్‌ పనుల నిమిత్తం గురువారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ ప్రవీణ్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

మద్యం మత్తులో

కూలీ ఆత్మహత్య

తాండూరు రూరల్‌: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని సిరిగిరిపేట్‌ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. కరన్‌కోట్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంటింటి ఈశ్వరప్పకు ముగ్గురు కొడుకులు. అందరికి వివాహం కావడంతో వేరువేరు కాపురాలు పెట్టారు. పెద్ద కుమారుడు వీరేశం(37) కూలీ పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. కొంతకాలంగా ఆయన మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి ఇంటి పరిసరాల్లో వీరేశం ఉరేసుకున్నాడు. ఉదయం ఇంటి ఆవరణలో విగతజీవిగా పడి ఉండటాన్ని ఆయన భార్య పుష్పమ్మ చూసి కుటుంబసభ్యులకు తెలిపింది. మద్యానికి బానిసై తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి ఈశ్వరప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

యువత ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి

కుల్కచర్ల: యువత ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకుసాగాలని కుల్కచర్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు ముదిరాజ్‌ అన్నారు. బుధవారం మండలంలోని ముజాహిద్‌పూర్‌ గ్రామంలో అగ్నివీర్‌కు ఎంపికై న శివకుమార్‌ను ఘనంగా స్థానిక పాఠశాలలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత వ్యసనాల బారిన పడకుండా దృఢ సంకల్పంతో లక్ష్యం వైపు సాగాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జనార్దన్‌రెడ్డి, నాయకులు కృష్ణయ్య, అంబదాస్‌, గోపాల్‌, శ్రీనివాస్‌, హన్మంతు, రాములు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలను దోపిడీ చేస్తున్న ప్రభుత్వాలు

బీఎంపీ జిల్లా అధ్యక్షుడు గట్ట్యానాయక్‌

పరిగి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నాయని బీఎంపీ జిల్లా అధ్యక్షుడు గట్ట్యానాయక్‌ అన్నారు. బహజన ముక్తి పార్టీ బుధవారం జైల్‌ భరో ఆందోళన కార్యక్రమానికి పిలుపు నివ్వడంతో ఆ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తూ అరెస్ట్‌ చేశారు. అనంతరం బీఎంపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్లను దొంగలించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డాక్టర్‌.బీఆర్‌.అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనీస చర్యలు తీసుకోలేరన్నారు. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ఆమోదించడం సరికాదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు గోవింద్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

అనంతగిరి: షిర్డీ సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉంటుందని ఆలయ ట్రస్టు సభ్యులు రాజేందర్‌ అగర్వాల్‌, సంతోష్‌ అగర్వల్‌ అన్నారు. ఈ మేరకు వికారాబాద్‌ మండలం ఐనాపూర్‌ సమీపంలోని సాయిబాబా మందిరం అష్టమ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాగడ హారతి, అభిషేకం, శ్రీ గణేశ, గోమాత, భవానిమాత తదితర పూజలు చేశారు. సాయంత్రం ఆలయంలో సాయిబాబా బృందం చేత భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆయా గ్రామాల ప్రజలు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ సరఫరాలో  అంతరాయం1
1/3

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

విద్యుత్‌ సరఫరాలో  అంతరాయం2
2/3

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

విద్యుత్‌ సరఫరాలో  అంతరాయం3
3/3

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement