దళారులను నమ్మి మోసపోవద్దు
● ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి ● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ
దుద్యాల్: ఆరుగాలం కష్టించి పండించిన పంటలను దళారులకు అమ్మి నష్టపోరాదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్ రెడ్డి, మెట్లకుంట పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ సూచించారు. బుధవారం మండలంలోని పోలేపల్లి, చిలుముల మైల్వార్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళారులు ఎక్కువ ధర ఆశచూసి తూకంలో మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. క్వింటాలుఏ – గ్రేడ్ ధాన్యానికి రూ.2,320, బీ గ్రేడ్‌కు రూ.2,300 చెల్లిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవోలు జ్యోతి, మాణిక్య శ్రీ,, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వెంకటయ్య గౌడ్, నర్సింలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


