దరఖాస్తుల వెల్లువ
రాజీవ్ యువ వికాసానికి
14వరకు అవకాశం
దౌల్తాబాద్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు బీసీ కార్పొరేషన్‌కు 429, ఎస్సీ 158, ఎస్టీ 76, ఈబీసీ 03, మైనార్టీ కార్పొరేషన్‌కు 30 మొత్తం 696 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 6వ తేదీ వరకు తుది గడువు ఉండగా తర్వాత 14 వరకు పొడిగించారు. నేడు రెండో శనివారం, ఆదివారం, 14న అంబేడ్కర్ జయంతి ఉండడంతో మూడు రోజులు సెలవులు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం వరకు దరఖాస్తుల ప్రక్రియ చేయాలని లబ్ధిదారులు బారులు తీరారు. కానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సోమవారం కూడా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.
సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించండి
తాండూరు రూరల్: మల్కాపూర్ గ్రామంలోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకశాలు కల్పించాలని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు కోరారు. శుక్రవారం మల్కాపూర్ గ్రామ శివారులోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ సిబ్బందికి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్కాపూర్ గ్రామ భూముల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు. ఫ్యాక్టరీ తరఫున గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ము, ధూళీతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఆర్‌సీ గౌడ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చిరంజీవి, యువకులు ప్రశాంత్‌గౌడ్, అరవింద్, తుకారం, తుల్జప్ప, నర్సింహా, బాలాజీ, రఘుగౌడ్, మహేష్, నిఖిల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
చిరుధాన్యాలవాడకాన్ని పెంచాలి
కుల్కచర్ల: నిత్యజీవితంలో చిరుధాన్యాల వాడకాన్ని పెంచాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ యాదమ్మ అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండలం గోప్యానాయక్ తండాలో పోషణమాసం ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గర్భిణులు, బాలింతలు పోషక ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తవన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ మల్లమ్మ, ఏ.మల్లమ్మ, కార్యదర్శి శారద, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల వెల్లువ
దరఖాస్తుల వెల్లువ


