
చట్టాలపై అవగాహన ఉండాలి
జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్
అనంతగిరి: ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్ అన్నారు. బుధవారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్‌లోని సంఘం లక్ష్మీబాయి కళాశాలలో విద్యార్థినీలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చేయడం నేరమన్నారు. ఎక్కడైన బాల్యవివాహాలు జరుగుతుంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. పిల్లలను పనిలో పెట్టుకోరాదని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేష్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ పి.రాము, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ శ్రీనివాస్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థిఽనీలు పాల్గొన్నారు.
రేపు మెగా జాబ్‌మేళా
తాండూరు టౌన్: మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకుని ఈ నెల 11న పట్టణంలోని సింధు బాలికల జూనియర్ కళాశాలలో బీసీ సంఘం, గ్లోబల్ యువతరం ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు కొనసాగనున్న ఈ మేళాకు పది, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ, పారామెడికల్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు తగు సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. అర్హులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
వికారాబాద్‌లో తనిఖీలు
అనంతగిరి: వికారాబాద్ రైల్వే స్టేషన్, బస్టాండ్, మార్కెట్‌లో బుధవారం జిల్లా బీడీ టీం, డాగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల గుర్తింపు.. నేర చర్యలకు అడ్డుకట్టవేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణను అడ్డుకోవడం కూడా ఈ తనిఖీలో ప్రధాన భాగమన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.
ఘన సన్మానం
అనంతగిరి: వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై న బస్వరాజ్ పటేల్‌ను బుధవారం జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు నాగయ్య, జిల్లా అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, బస్వరాజు గౌడ్, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్,నాయకులు లూయిస్,గౌస్ పటేల్, ధన్‌శెట్టి, సుధీర్, తిర్మలయ్య పాల్గొన్నారు.
నేటి నుంచి
రామలింగేశ్వర జాతర
బంట్వారం: కోట్‌పల్లి మండలం బుగ్గాపురం రామలింగేశ్వర జాతర నేటి నుంచి ప్రారంభమవుతుందని ఆలయ ధర్మకర్త మహేందర్‌రావు దేశ్‌ముఖ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం పల్లకీ సేవ, ధ్వజా రోహణం, 11న పల్లకీ సేవ, 12న అభిషేకం, రథోత్సవం, అన్నదానం, భజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. 13న పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, దీపార్చన, 14న పల్లకీ సేవ, ముగింపు వేడుకలు ఉంటుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

చట్టాలపై అవగాహన ఉండాలి

చట్టాలపై అవగాహన ఉండాలి