
రజతోత్సవాన్ని విజయవంతం చేయండి
పరిగి: 25 ఏళ్లుగా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి బీఆర్‌ఎస్ పాటుపడుతోందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ఈ నెల 27న వరంగల్ వేదిక నిర్వహించే రజతోత్సవ సభ వాల్‌రైటింగ్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీ బీఆర్‌ఆఎస్ అన్నారు. పార్టీ ఏర్పాటు నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా అడుగులు వేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ పోరాడారని చెప్పారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి తప్పుదోవలో ఓట్లను దన్నుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌దే అధికారమన్నారు. వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుందఅశోక్ కుమార్, సీనియర్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, సురేందర్, రవికుమార్, కృష్ణ తదితరులు ఉన్నారు.
పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి