
ప్రజలకు అందుబాటులో ఉండండి: డీఎంహెచ్‌ఓ
అనంతగిరి: వికారాబాద్ మండలం సిద్దులూర్ పీహెచ్‌సీని గురువారం డీఎంహెచ్‌ఓ వెంకటరవణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో జరుగుతన్న పునరుద్ధరణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ఈదురు గాలులకు నేలరాలిన మామిడి కాయలు
దోమ: మండల వ్యాప్తంగా గురువారం బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో మామిడి తోటలకు నష్టం జరిగింది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని కాపాడుకుంటున్న మామిడి పంట ఈదురు గాలుల కారణంగా దెబ్బతినిందని రైతులు తెలిపారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, దిగుబడి వచ్చే సమయంలో పంట దెబ్బతినిందని రాకొండ గ్రామానికి చెందిన తలారి భీమయ్య ఆవేదన వ్యక్తం చేశారు.