
విద్యార్థులకు క్రమశిక్షణ ప్రధానం
దోమ: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను నేర్చుకోవాలని ఎంఈఓ వెంకట్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని బొంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు షఫి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తుందని, విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నర్సింహులు, స్కూల్ చైర్మన్ నసీమా బేగం, కాంప్లెక్స్ సీఆర్‌పీ వెంకటేశ్, ఉపాధ్యాయులు ప్రవీణ్, ముత్యప్ప, నరేందర్, సావిత్రి, స్వప్న, జరీనా బేగం, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.