
ఎన్నికలప్పుడే రాజకీయం
● ఎమ్మెల్యేలు, మంత్రులతోకలిసి పని చేస్తా ● ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ● తాండూరు, పెద్దేముల్ మండలాల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
తాండూరు రూరల్: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని..అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పని చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం తాండూరు, పెద్దేముల్ మండలాల్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు, పూర్తయి న వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి పని చేస్తానని తెలిపారు. పార్లమెంట్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు రూ.11 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. అనంతరం పెద్దే ముల్ మండలంలోని మంబాపూర్, నర్సాపూ ర్,గాజీపూర్,తాండూరు మండలంలోని గోనూ ర్,వీర్‌శెట్టిపల్లి గ్రామాల్లో పర్యటించారు. జూలై నుంచి అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పా రు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, పార్టీ తాండూరు, పెద్దేముల్ మండలాల అధ్యక్షులు ప్రభు శంకర్, హరీశ్, నాయకులు విక్రం, రాంచెంద్రి, యాదు గౌడ్, రాంసాగర్, శ్రీకాంత్, వడ్ల రఘు, నరేందర్ పాల్గొన్నారు.