
ఆదర్శప్రాయుడు పూలే
అనంతగిరి: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సీ్త్ర విద్య కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి జ్యోతీరావ్ పూలే అని, ఆయన అందరికీ ఆదర్శప్రాయుడని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతీరావ్ పూలే గొప్ప సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీబీసీడీఓ కే.ఉపేందర్, డీఎస్సీడబ్ల్యూఓ మల్లేశం, సీపీఓ వెంకటేశ్వర్లు, డీసీఎస్‌ఓ మోహన్‌బాబు, డీఎంహెచ్‌ఓ వెంకటరవణ, ఏబీసీడీఓ భీమరాజు తదితరులు పాల్గొన్నారు.
పోషణ పక్షంను విజయవంతం చేయాలి
పోషణ అభియాన్ ఆధ్వర్యంలో ఈ నెల 22 వరకు నిర్వహించే పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మహిళా సీ్త్ర శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, వైద్య శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పోషకాహార లోపాన్ని తగ్గించడంతో పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, కౌమార బాలికల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీపీవో జయసుధ, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ వెంకటరవణ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ విరమణ సహజం
ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ సహజమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వికారాబాద్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ ఉద్యోగ విరమణ సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో మనం చేసే సేవలే గుర్తిండిపోతాయన్నారు. అనంతరం అశోక్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్
ఘనంగా జయంతి వేడుకలు