
ఖాతాదారులు ఆందోళన చెందొద్దు
తాండూరు రూరల్: కరన్‌కోట్ గ్రామ సమీపంలోని సీసీఐ టౌన్‌షిప్‌లో ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో ఖాతాదారులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని బ్యాంక్ మేనేజర్ టి.భువన్ మోహన్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం బ్యాంక్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా కాలిపోయిందన్నారు. బ్యాంక్‌లో 6 వేల మందికి సంబంధించిన ఖాతాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కరన్‌కోట్‌లోని బ్యాంక్‌లో కార్యకలపాలు పూర్తిగా నిలిచిపోయాయన్నారు. కావున బ్యాంక్ ఖాతాదారులు లావాదేవిలకు సంబంధించి తాండూరు పట్టణంలోని శాంత్ మహల్ వద్ద ఎస్‌బీఐ (ఏడీబీ)లో రెండు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా కరన్‌కోట్ గ్రామంలో కస్టమర్ సర్వీస్ పాయింట్(సీఎస్‌పీ)లో కూడా ఖాతాదారులు నగదు డిపాజిట్లు, ఉపసంహరణ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
రుణాల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత
ప్రస్తుతం బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం వలన కంప్యూటర్లతో పాటు ఫర్నిచర్ పూర్తిగా కాలిపోవడంతో ఖాతాదారులకు పంట రుణాలు, గోల్డ్‌లోన్, పర్సనల్‌లోన్‌కు సంబంధించి ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేశామని బ్యాంక్ మేనేజర్ భువన్ మోహన్ తెలిపారు. వారం రోజుల్లో రోజువారి బ్యాంక్ లావాదేవిలకు సంబంధించి కార్యకలపాలు పునరుద్దరిస్తామన్నారు.
తాండూరు ఎస్‌బీఐలో
తాత్కాలిక లావాదేవిల కార్యకలాపాలు
వివరాలు వెల్లడించిన
బ్యాంక్ మేనేజర్ భువన్ మోహన్