జర్నలిస్టుల పక్షాన అలుపెరగని పోరాటం
తుక్కుగూడ: రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొసం తమ వంతు కృషి చేస్తామన్ని టీడబ్ల్యూజేఎఫ్ (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. తుక్కుగూడలో శక్రవారం నిర్వహించిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం 2006లో టీడబ్ల్యూజేఎఫ్‌ను ఏర్పాటు చేశామన్నారు. నాటి నుంచి ఈరోజు వరకు జర్నలిస్టుల పక్షాన అలుపెరగకుండా పోరాడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని జర్నలిస్టు సంఘాలు ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి వత్తాసు పలికి, స్వార్థ రాజకీయాల కోసం సంఘాలను వాడుకుంటున్నాయని ఆరోపించారు. ప్రైవేటు విద్యారంగంలో జర్నలిస్టుల పిల్లలుకు ఫీజులో 50 శాతం రాయితీ అందించాలని, వైద్యంలో రాయితీ ఇవ్వాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నూతనంగా సంఘంలో చేరిన వారికి సభ్వత్వాలు అందజేశారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, రాష్ట్ర నాయకులు జగదీశ్, రాజశేఖర్, ఆనందం దేవేందర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సత్యానారాయణ, సైదులు తదితరులు పాల్గొన్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
తుక్కుగూడలో సంఘం జిల్లా కమిటీ సమావేశం


