
బాక్సింగ్‌లో మెరిసిన గిరిజన బిడ్డ
రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించిన నిఖిత
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం మన్‌సాన్‌పల్లికి చెందిన విఠల్‌నాయక్, దేవీబాయ్‌ల కూతు రు నిఖిత రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో సత్తాచాటింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నార్సింగ్ గిరిజన గురుకులంలో ఇంటర్ ద్వితీ య సంవత్సరం చదువుతోంది. ఈ నెల 11, 12వ తేదీల్లో సికింద్రాబాద్‌లో జరిగిన అండర్ –19 బాలికల విభాగం పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.
దరఖాస్తు గడువు పెంచాలి
బంట్వారం: రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తు స్వీకరణ గడువును ఈ నెల చివరి వరకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అత్తెల్లి లక్ష్మణ్ యాదవ్ కోరారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు గడువు ఈ నెల 14తో ముగియనున్నందున చాలా మంది అప్లయ్ చేసుకోలేదని తెలిపారు. నెట్‌వర్క్ సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వరుస సెలవుల కారణంగా చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని గడువు పెంచితే బాగుంటుందని తెలిపారు. ఈ విషయా న్ని తాము ఆయా శాఖల ఉన్నతాధికారులకు విన్నవించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి గడువు పొడిగించాలని ఆయన కోరారు.
రోడ్డు పనుల పరిశీలన
ధారూరు: మండలంలోని అల్లిపూర్ నుంచి తాండూరు – హైదరాబాద్ ప్రధాన రహదారి వరకు జరుగుతున్న రోడ్డు పనులను సోమ వారం పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.
యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
విశ్రాంత అడిషన్ ఎస్పీ మధుసూదన్‌రావు
తాండూరు రూరల్: యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని విశ్రాంత అడిషన్ ఎస్పీ మధుసూదన్‌రావు సూచించారు. సోమవారం పెద్దేముల్ మండలం తట్టేపల్లిలో సీనియర్ నాయకుడు ప్రభుకుమార్ తల్లిదండ్రుల(మొగులప్ప, చంద్రమ్మ) జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రావు మాట్లాడుతూ.. యువత క్రీడలపై ఆసక్తి చూపకపోవడం బాధాకరమన్నారు. చదువుతోపాటు ఆటల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రాజ్‌కుమార్, అంజయ్య, నర్సింలు, శంకర్‌నాయక్, లక్ష్మణ్, రాజప్పగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
శంషాబాద్ డీసీపీ రాజేష్
కొందుర్గు: విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని శంషాబాద్ డీసీపీ రాజేష్ హెచ్చరించారు. కొందుర్గు పోలీసుస్టేషన్ సోమవారం సందర్శించిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు. పీఎస్ రికార్డులు, కేసు ఫైళ్లు, పోలీసు క్వార్టర్స్, పీఎస్‌లో వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెట్రోలింగ్ సిబ్బంది 100 డయల్‌కు కాల్ వచ్చిన వెంటనే జాప్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకొని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. విజిబుల్ పోలీసింగ్ క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో షాద్‌నగర్ రూరల్ సీఐ నర్సయ్య, ఎస్సైలు రవీందర్ నాయక్, బాలస్వామి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బాక్సింగ్‌లో మెరిసిన గిరిజన బిడ్డ

బాక్సింగ్‌లో మెరిసిన గిరిజన బిడ్డ