మహిళలు స్వయం ఉపాధి పొందాలి
హయత్‌నగర్: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం ఉపాధి సరైన మార్గమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కుట్టు మిషన్, బ్యూటీషియన్ శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 200 మంది మహిళలకు శనివారం తొర్రూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలకు శిక్షణ ఇచ్చి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడం అభినందనీయమన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అతివలు మరొకరికి మార్గదర్శకంగా నిలవాలని, ఒకరికొకరు చేయూతనందించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ యాదిరెడ్డి, నాయకులు బలవంతరెడ్డి, ధన్‌రాజ్‌గౌడ్, రమేశ్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, కుమార్‌గౌడ్, బుచ్చిరెడ్డి, లక్ష్మణ్, బాల్‌రాజ్‌గౌడ్, పాండు, మధుసూదన్‌రెడ్డి, పోచయ్య, యాదగిరి తదితరులు పాల్నొన్నారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


