
అకాల వర్షం.. ఆగమాగం!
గంటపాటు తీవ్ర గాలులతో కూడిన వడగండ్ల వాన
● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్, చెట్లు, తెగి పడిన తీగలు ● మూడు గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిపివేత
తాండూరు రూరల్/మోమిన్‌పేట: అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఒక్కసారిగా గాలివాన, వడగండ్ల వర్షం భయపెట్టింది. గంటపాటు తీవ్ర గాలులు వీచాయి. పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాలు నేలకొరిగాయి, గ్రామాల్లో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. పెద్దేముల్ మండలం అడికిచెర్ల, ఊరెంటితండా, బాయిమీది తండాల్లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా గాలివాన, వడగండ్ల వర్షం పడింది. దీంతో ఆయా గ్రామాల్లో విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డాయి. తట్టేపల్లి 11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరాను ఆపేశారు. రతన్‌సింగ్‌రైతు పొలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నెలకొరిగింది. మూడు స్తంభాలు పడిపోయాయి. అధికారులు కరెంట్ సరఫరాను ఆపేశారు. గురువారం ఉదయం విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. మోమిన్‌పేట మండలంలో బుధవారం ఒక్కసారిగా ఈదురుగాలులు వీచాయి.

అకాల వర్షం.. ఆగమాగం!

అకాల వర్షం.. ఆగమాగం!