
మహానుభావా.. మన్నించుమా!
భారత రాజ్యాంగ నిర్మాత.. ప్రపంచ మేధావి.. అణగారిన వర్గాల ఆరాధ్యుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్.. అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాలు ఏడాది నుంచి ప్రారంభానికి నోచుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బొంరాస్‌పేట, తుంకిమెట్ల గ్రామాల్లో ఏడాది క్రితం అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. రాజకీయ విభేదాల కారణంగా వాటిని ప్రారంభించలేదు. బురాన్‌పూర్‌లో రెండేళ్ల క్రితం దిమ్మె నిర్మించి విగ్రహం ఏర్పాటును విస్మరించారు.. నేడు అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మహనీయుడి విగ్రహాలను ప్రారంభించాలని అంబేడ్కర్, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
– బొంరాస్‌పేట

మహానుభావా.. మన్నించుమా!