
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
కుల్కచర్ల: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్మోహన్ శర్మ అన్నారు. సోమవారం ఆయన చౌడాపూర్ మండలం మరికల్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.5 లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రతీ కాలనీకి సీసీ రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, శివకుమార్, దామోదర్‌రెడ్డి, నరేందర్, రాజు, వెంకటయ్య, జహంగీర్, నర్సింలు, స్థానిక నాయకులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
కుల్కచర్ల ఏఎంసీ వైస్ చైర్మన్ రామ్మోహన్‌శర్మ