
కదలని ‘ఇందిరమ్మ’
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒక్క అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది. పైలెట్ గ్రామాల్లో పథకం ప్రారంభించి నాలుగు నెలలు కావస్తున్నా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు ఉండగా ఒక్కోదానికి 3,500 చొప్పున 14,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. మొదటి విడతలో 2,285 ఇళ్లకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. 266 ఇళ్లకు హౌసింగ్ అధికారులు మార్కింగ్ ఇవ్వగా కేవలం 23 ఇళ్లకు సంబంధించిన పునాది పనులు మాత్రమే పూర్తయ్యాయి.మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగా రెండో విడత లబ్ధిదారులను ఎంపికకుఅధికారులు సిద్ధమయ్యారు. పథకం సమర్థవంతంగా అమలు కాకపోవడానికి ఇంజనీర్ల కొరత కూడా ఓ కారణంగా తెలుస్తోంది. పథకం పర్యవేక్షణకు ఒక పీడీ, నలుగురు డీఈలు, ముగ్గురు ఏఈలు మాత్రమే ఉన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలోజరుగుతున్న జాప్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – వికారాబాద్
– పూర్తి వివరాలు 9లోu

కదలని ‘ఇందిరమ్మ’