
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు
● మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గోవింద్‌రాజు
తాండూరు టౌన్: మైనింగ్ నిబంధనలను ఉల్లంఘించే వారి అనుమతులను రద్దు చేస్తామని గనుల శాఖ డిప్యూటీ డైరక్టర్ గోవింద్‌రాజు అన్నారు. పట్టణంలోని మైనింగ్ శాఖ కార్యాలయంలో ఏడీ సత్యనారాయణతో కలిసి బుధ వారం లీజుదారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సుద్ద తవ్వకాలకు అనుమతులు పొందిన లీజుదారులు నిబంధనల ప్రకారమే తవ్వకాలు చేపట్టాలన్నారు. 2011నుంచి 2025 వరకు 22 మందిపై పెనాల్టీలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురు మాత్రమే అపరాధ రుసుంలు చెల్లించారని, మిగిలిన 16మంది రూ.1.06 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. 2024– 2025 ఆర్థిక సంవత్సరానికి మైనింగ్ శాఖ జిల్లాకు రూ.151 కోట్ల టార్గెట్ ఇచ్చిందని, ఇందులో రూ.133 కోట్ల ఆదాయం వచ్చిందని డీడీ తెలిపారు.