
వీధి కుక్కల దాడిలో 15 మేకల మృతి
దోమ: వీధి కుక్కల దాడిలో 15 మేకలు మృతి చెందిన ఘటన మండలంలోని మోత్కూర్‌లో చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివ రాల ప్రకారం.. గ్రామానికి చెందిన జీడీ అంజిలయ్య శుక్రవారం సాయంత్రం తన పొలంలోని షెడ్డులో మేకలను కట్టేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి భోజనం చేసి మళ్లీ పొలానికి వచ్చాడు. అప్పటికే వీధి కుక్కులు దాడి చేసి 15 మేకలను చంపేశాయి. సుమారు లక్ష రూపాయల నష్టం జరిగిందని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. అలాగే బొంపల్లి తండాలో నర్సింహులు చెందిన లేగదూడపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.