‘ఆకార్ ఆశా’ సేవలను సద్వినియోగం చేసుకోండి
● అడిషనల్ కలెక్టర్ సుధీర్ ● ఉచిత శస్త్ర చికిత్సలపై అవగాహన సదస్సు
మర్పల్లి: పుట్టుకతో వచ్చే లోపాలు, అంగవైకల్యంతో బాధపడే పేదలకు ఆకార్ ఆశా స్వచ్ఛంద సంస్థ ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తుందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంసీఎం ఫంక్షన్ హాల్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆకార్ ఆశా సేవలపై అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరవణ, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఆకార్ ఆశా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భారతేంద్రస్వేన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆకార్ ఆశా సేవలను అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు పుట్టుకతో వచ్చే లోపాలు, అంగవైకల్యం, మొర్రి అంగలిలో లోపాలు, నాలుక అత్తుకుపోవడం, వినికిడి లోపం, కాళ్ల వేళ్లు, చేతి వేళ్లు అత్తుకుపోవడం, కనుబొమ్మలు, ఇతర అవయవాలు అభివృద్ధి చెందక పోవడం గురించి తెలియజేయడంతోపాటు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య సేవలపై డెమో ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ మంజుల, డాక్టర్ షాలినీ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవరాజ్, డాక్టర్ ప్రవీణ్, పట్లూర్ పీహెచ్‌సీ డాక్టర్ మానస హర్ష, డాక్టర్ విజయ్‌కుమార్, ఎంపీడీఓ రాజ్ మల్లయ్య, ఎంపీఓ లక్ష్మీకాంత్, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, ప్రోగ్రాం ఆఫీసర్ మహేష్‌కుమార్, సీడీపీఓ ప్రవీణ, ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ కృష్ణారావు, ఐకేపీ ఏపీఎం మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
‘ఆకార్ ఆశా’ సేవలను సద్వినియోగం చేసుకోండి


