
సీఎం ఇలాఖాలో ప్రగతి ‘బాటలు’
బొంరాస్‌పేట: ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పల్లెలు, గిరిజన తండాలు, గల్లీలు సైతం అభివృద్ధి పనులతో ప్రగతి పట్టాయని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని మెట్లకుంట, బురాన్‌పూర్, బొంరాస్‌పేట, ఏర్పుమళ్ల, చౌదర్‌పల్లి గ్రామాలకు రూ.కోట్ల నిధులతో డబుల్ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల నియోజకవర్గం పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. చౌదర్‌పల్లి, నాందార్‌పూర్ – ఏర్పుమళ్ల, ఏర్పుమళ్ల – బుద్లాపూర్, బొంరాస్‌పేట – నాగారం, బొంరాస్‌పేట – బుర్రితండా, మెట్లకుంట – లోతికుంటతండా, బొంరాపేట – తుంకిమెట్ల డబుల్ రోడ్డు నిరాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకన్‌గౌడ్, పార్టీ నాయకులు నర్సింలుగౌడ్, వెంకట్రాములుగౌడ్, జయకృష్ణ, రాంచంద్రారెడ్డి, నర్సింలు నాయుడు, రాములు, రవిగౌడ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
రూ.58.99కోట్ల నిధులతో
డబుల్ రోడ్లకు శంకుస్థాపనలు