
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
తాండూరు రూరల్: తెలంగాణ ఒపెన్ టెన్త్, ఇంటర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒపెన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని తాండూరు తహసీల్దార్ కేతావత్ తారాసింగ్ పేర్కొన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(జీజేసీ) పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ..నేటి నుంచి 26వ తేదీ వరకు ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తాండూరు పట్టణంలో ఒపెన్ టెన్త్‌కు సెయింట్ మారస్క్ స్కూల్, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(జీజేసీ), సాయిపూర్‌లోని నంబర్ 1 ప్రభుత్వ పాఠశాల, పాత తాండూరులోని ప్రభుత్వ బాలికల ఉర్దూమీడియం పాఠశాల పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30గంటలనుంచి, సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నలుగురు చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్‌మెంట్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్స్‌లతో పాటు 40 మంది ఇన్విజిలెటర్లను ప్రభుత్వం నియమించిందన్నారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలన్నారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఆయన వెంట ఎంఈఓ వెంకటయ్య, డిపార్ట్‌మెంట్ అధికారులు లక్ష్మయ్య, నసీమున్నీసా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాండూరు తహసీల్దార్ తారాసింగ్