● జిల్లా కేంద్రంలో ఇదీ పరిస్థితి..
వికారాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఎన్టీఆర్, బీజేఆర్ చౌరస్తాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రామయ్యగూడ వెళ్లే దారిలో, ఆలంపల్లి రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్ చౌరస్తాలో, మహాశక్తి థియేటర్ వద్ద, గంగారం చౌరస్తాలో వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం స్కూల్స్, కళాశాలల సమయంలో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఎస్‌బీఐ, ఆలంపల్లి వద్ద రోడ్డుపైనే క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఈ ప్రాంతంలో పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్డుపైనే వాహనాలను ఆపుతున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుంతోంది.
ప్రతిపాదనలు పంపాం
జిల్లా కేంద్రం వికారాబాద్‌తోపాటు, తాండూరు, పరిగి మున్సిపాలిటీల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా వరకు వాటిని అధిగమిస్తున్నాం. త్వరలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.
– నారాయణరెడ్డి, ఎస్పీ


