సంఘాలు ఐక్యంగా కొనసాగాలి | - | Sakshi
Sakshi News home page

సంఘాలు ఐక్యంగా కొనసాగాలి

Published Tue, Apr 8 2025 11:07 AM | Last Updated on Tue, Apr 8 2025 11:07 AM

సంఘాల

సంఘాలు ఐక్యంగా కొనసాగాలి

పరిగి మాజీ ఎమ్మెల్యే

కొప్పుల మహేశ్‌రెడ్డి

పరిగి: సంఘాలు సంఘటితంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పట్టణ కేంద్రంలో నిర్వహించిన పరిగి ఆర్యవైశ్య సంఘం వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘాలు పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్యవైశ్య సంఘానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించి వారి అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్‌ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌, మాజీ కౌన్సిలర్లు కిరణ్‌, కృష్ణ, రమేష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎదురెదురుగా బైక్‌లు ఢీ

ఒకరి దుర్మరణం,భార్యాభర్తలకు గాయాలు

కేసు నమోదు చేసిన పోలీసులు

ధారూరు: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒకరు దుర్మరణం పాలవగా భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని ఎబ్బనూర్‌ చెరువు సమీప రోడ్డుపై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ధారూరు ఎస్‌ఐ అనిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రుద్రారానికి చెందిన కంది శ్రీనివాస్‌(28) పని నిమిత్తం తన పల్సర్‌ బైక్‌పై వికారాబాద్‌ బయలుదేరాడు. గట్టెపల్లికి చెందిన నర్సింలు తన భార్య లక్ష్మితో కలిసి బైక్‌పై వికారాబాద్‌ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఎబ్బనూర్‌ చెరువు సమీపంలోకి రాగానే రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. గాయపడ్డ వారిని వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. శ్రీనివాస్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం

బొంరాస్‌పేట: కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ వ్యక్తి మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం మండల పరిధిలోని ఎన్కేపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవూఫ్‌ తెలిపిన ప్రకారం.. కొడంగల్‌ పట్టణానికి చెందిన పల్లగేరి మల్కప్ప(35)కు పన్నెండేళ్ల క్రితం ఎన్కేపల్లికి చెందిన గొటికె రాములప్ప కూతురు నర్సమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు సంతానం. మల్కప్పకు తల్లిదండ్రులు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబపోషణ సైతం భారంగా ఉందని మదనపడుతున్నాడు. తాజాగా తన భార్య పుట్టింటికి వెళ్లడంతో సోమవారం ఎన్కేపల్లికి వచ్చిన ఆయన కొడంగల్‌కు వెళ్దామని కోరాడు. దీంతో ఆయన మామ రాములు ముందుగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన మల్కప్ప ఎన్కేపల్లి శివారులో పప్పురేగడి వద్ద దోమలవంపు ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను మనస్తాపంతో చనిపోతున్నానంటూ మృతుడు మల్కప్ప ముందుగా తన కుటంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని.. దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని పెట్టిన వాయిస్‌ మెసేజ్‌ వాట్సప్‌ గ్రూపుల్లో వైరల్‌ అయింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. మృతదేహాన్ని కొడంగల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

పోలీసుల అదుపులో ముగ్గురు వ్యక్తులు?

కుల్కచర్ల: మండల పరిధిలోని ఇప్పాయిపల్లిలో జరిగిన చైన్‌ స్నాచింగ్‌ కేసు విచారణ వేగవంతమైంది. గ్రామానికి చెందిన నర్సమ్మ మెడలోంచి ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసు లాక్కిళ్లిన ఘటనలో బాధితురాలి మెడకు గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న విషయం తెలిసిందే. కేసు విచారణ భాగంగా రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలు సోమవారం తిర్మలాపూర్‌కు చెందిన ఒకరు, ఇప్పాయిపల్లికి చెందిన ఇద్దరు అనుమానితుల్ని అదుపులో కి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే చైన్‌ స్నాచింగ్‌ ఘటన యాదృచ్ఛికంగా జరిగిందా..? ఉద్దేశ పూర్వకంగా దాడి చేశారా..? అనేది బాధితురాలు తేరుకుంటేనే తేలుతుంది.

సంఘాలు ఐక్యంగా కొనసాగాలి1
1/1

సంఘాలు ఐక్యంగా కొనసాగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement