ప్రధాన వార్తలు

నిమిష మరణశిక్ష వాయిదా
యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. యెమెన్ సనా జైలులో రేపు మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్‌కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంతో శిక్ష వాయిదా పడినట్లు సమాచారం.నిమిష శిక్ష వాయిదా పడ్డ విషయాన్ని యెమెన్‌లో ‘‘సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’’ సభ్యుడు శ్యామూల్ జోరెమ్ భాస్కరన్ ధృవీకరించారు. అయితే.. బాధిత కుటుంబం బ్లడ్‌మనీ(పరిహారం సొమ్ము)కుగానీ, శిక్షరద్దుకుగానీ అంగకరించలేదని ఆయన తెలిపారు. చర్చల్లో ఇంకా పురోగతి రావాల్సి ఉందని అంటున్నారాయన.కేరళకు చెందిన ఇండియా గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్, షేఖ్ హబీబ్ ఉమ్మర్ వంటి మత గురువులు తమ ప్రతినిధులతో క్షమాభిక్ష కోసం రాయబారం జరుపుతున్నారు. తలాల్ అబ్దో మహ్దీ కుటుంబంతో మతపెద్దలు ఉత్తర యెమెన్‌లో అత్యవసర భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిక్ష వాయిదా పడడం గమనార్హం. మరోవైపు.. నిమిషా ప్రియ విషయంలో భారత విదేశాంగశాఖ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంఈఏ అక్కడి జైలు అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. హౌతీ నియంత్రణలోని యెమెన్‌తో భారతకు అంతగా దౌత్యపరమైన సత్సంబంధాలు లేవు. ఈ తరుణంలో తామ చేయగలిగినదంతా చేశామని, ఇంతకు మించి చేయలేమని కేంద్రం సోమవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే.. నిమిష కేసును బాధాకరంగా పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అనధికారిక మార్గాలను పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. కేరళ ప్రభుత్వం సైతం కేంద్రానికి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ వచ్చింది. ఇంకోవైపు క్షమాభిక్షపైగానీ, బ్లడ్‌మనీపైగానీ చర్చించేందుకు సైతం తలాల్ కుటుంబం ఇంతకాలం ముందుకు రాలేదు. అయితే తాజా భేటీలో ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యలు మొదటిసారి పాల్గొన్నట్లు తెలస్తోంది. ఈ పురోగతితో నిమిష శిక్ష రద్దయ్యే అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి.

చంద్రబాబు సర్కార్ మా భూములు లాక్కుంటుంది
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కరేడు గ్రామ రైతులు కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తోందంటూ ఫిర్యాదు చేశారు. పచ్చని పంట పొలాలను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. మీ పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అవసరమైతే గ్రామానికి కూడా వస్తానని జగన్ చెప్పారు.మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ మాట్లాడుతూ.. కరేడులో భూసేకరణ వెనుక పెద్ద కుట్రలు ఉన్నాయన్నారు. ఆల్రెడీ ఇండోసోల్‌కు భూములు తీసుకుని మళ్ళీ భూసేకరణ ఎందుకు? అంటూ ఆయన ప్రశ్నించారు. ‘‘పచ్చని పంటపొలాలను లాగేసుకుంటామంటే ఒప్పుకోం. వైఎస్ జగన్‌ని కలిసి ప్రభుత్వ కుట్రలను వివరించాం. ఇండోసోల్ కి ఆల్రెడీ భూములు ఎలాట్ చేసి ఇప్పుడు మరోచోట ఇస్తామంటూ భూములు సేకరించటం కరెక్ట్ కాదని మధుసూదన యాదవ్ అన్నారు.కరేడు గ్రామ రైతు మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ.. మా రైతుల సమస్యలను వైఎస్ జగన్‌కి వివరించాం. మాకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. జగన్ మా గ్రామానికి వస్తానన్నారు. మా ప్రాణామైనా ఇస్తాం.. కానీ ప్రభుత్వానికి మా భూములు ఇవ్వం. పరిశ్రమల పేరుతో భూములు లాక్కోవాలని చూస్తున్నారు. ఇండోసోల్ పేరుతో భూ వ్యాపారం చేస్తామంటే సహించం. సెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇచ్చేదిలేదుఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ.. ‘‘మా హయాంలో రామాయపట్నం పోర్టు తెచ్చినప్పుడు ఒక్క సమస్య కూడా రాలేదు. బాధితులకు నచ్చచెప్పి పునరావాసం కల్పించాం. ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటు కావాల్సిన భూములు కూడా ఇచ్చాం. కానీ చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేసింది. ఇండోసోల్‌ను బలవంతంగా మరో చోటకు తరలించాలని చూస్తోంది. కరేడులో అన్ని రకాల పంటలు పండుతాయి...సంవత్సరం పొడవునా పంటలు పండే గ్రామం అది. రెండున్నర వేల మత్స్యకార కుటుంబాలను ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఎస్టీలంతా గ్రామంలోని పొలాల్లో పనులు చేసుకుని బతుకుతారు. వారిని కూడా వెళ్లగొట్టాలని చూస్తున్నారు. కరేడులో 18 వేల మంది ఉన్నారు. వారందరినీ రోడ్డున పడేయాలని చూడటం కరెక్ట్ కాదు. సముద్రం ఒడ్డున 30కిమీ వరకు భూములు లాక్కునే కుట్రలు జరుగుతున్నాయి. అనేక గ్రామాలను కబళించడానికి ప్రయత్నం చేస్తున్నారు’’ అని మాధవరావు మండిపడ్డారు.

బనకచర్ల.. ఏపీకి షాకిచ్చిన తెలంగాణ
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదం కొత్త మలుపు తిరిగింది. బనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుపై చర్చకు ససేమీరా చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ఓ లేఖ రాసింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో రేపు(జూలై 16, 2025) అత్యున్నత స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. ఇందులో గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు, పర్యావరణ అనుమతులు, జల వివాదాలు ప్రధాన అంశాలు చర్చిస్తారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలో..ఇద్దరు సీఎంలను హాజరు కావాలంటూ కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. సమావేశంలో పాల్గొనే ప్రతినిధుల వివరాలు, అజెండా పంపాలని పేర్కొంది. అయితే..అయితే బనకచర్లపై చర్చించాలంటూ ఏపీ సింగిల్ ఎజెండా ఇచ్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్లపై చర్చ అవసరం లేదంటూ కేంద్రానికి తాజాగా లేఖ రాసి ట్విస్ట ఇచ్చింది. ఇప్పటివరకు బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవు. బీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీలు సైతం అభ్యంతరాలు తెలిపాయి. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించే బనకచర్లపై రేపటి సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదు. ఇతర అంశాలపై చర్చిస్తేనే మీటింగ్‌కు వస్తామని తెలంగాణ ప్రభుత్వం లేఖ ద్వారా కేంద్రానికి స్పష్టం చేసింది.తెలుగు రాష్ట్రాల నడుమ బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పందంగా మారింది తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి వరద జలాలను రాయలసీమకు మళ్లించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి చర్చలు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి కీలకంగా మారే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే తెలంగాణ ప్రభుత్వ తాజా లేఖతో జరగబోయే పరిణామాలపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ అభ్యంతరాలుప్రాజెక్టు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని వాదనగోదావరి ట్రైబ్యునల్ కేటాయింపులకు వ్యతిరేకంగా ఉందని అభిప్రాయంనాగార్జునసాగర్ వాడకాన్ని తప్పుబడుతూ, పర్యావరణ నష్టం గురించి ఆందోళన ఏపీ వాదనలువర్షాకాలంలో సముద్రంలో కలిసిపోతున్న వరద జలాలను వినియోగించాలన్న ఉద్దేశంరూ.80,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ప్రతిపాదన3 దశల్లో నిర్మాణం: పోలవరం → బొల్లపల్లి → బనకచర్లఏపీ ప్రభుత్వం పంపిన బనకచర్ల ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపించివేసింది. ఈ ప్రాజెక్టుపై పర్యావరణ నిపుణుల కమిటీ (EAC) అభ్యంతరాలు వ్యక్తం చేసిందని తెలిపింది. ఈ క్రమంలోనే గోదావరి వరద జలాల లభ్యతపై అధ్యయనం చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.ఇదీ చదవండి: బనకచర్ల.. గురు శిష్యుల డ్రామానా?

బాబుగారు.. అయ్యే పనులు చెప్పండి సార్!
ముగ్గురు పిల్లల్ని కనే తల్లిదండ్రులు దేశభక్తులట! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కొత్త ఉవాచ ఇది! డైవర్షన్ పాలిటిక్స్‌లో చేయితిరిగిన నేత తాజాగా ఎత్తుకున్న నినాదం ఇది అనుకోవాలి. జనాభాను పెంచాలంటున్నారు ఆయన. కానీ.. ఇదే ప్రామాణికమైతే చంద్రబాబు క్యాబినెట్లో దేశభక్తులు ఎందరని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అందరికంటే ముందు తన కుమారుడు, మంత్రి లోకేశ్‌కు సలహా ఇచ్చి దేశభక్తుడిని చేయాలి కదా? అని కొందరు చమత్కరిస్తున్నారు.తెలుగుదేశం పార్టీలో కోటి మంది సభ్యులు ఉన్నారని చెబుతారు. వారిలో పిల్లలను కనే అర్హత ఉన్నవారు ఎందరు..? చంద్రబాబు సూచన పాటించి 2029 నాటికి జనాభాను ఎంతమేరకు పెంచుతారు? మొదలైన వాటి గురించి చెప్పి ఉంటే ప్రజలకు ఆసక్తి ఏర్పడుతుంది కదా అని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది ఒక విధాన నిర్ణయం. ఇదేదో ఒక రాష్ట్రానికి పరిమితం అయ్యే అంశం కాదు. దేశానికి ఒక జనాభా విధానం ఉంటుంది. అయినా రాష్ట్రాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని చంద్రబాబు చెబుతున్నట్లు పిల్లలను కనకపోతేనో, కంటేనో దేశభక్తులు అవడం, అవ్వకపోవడం ఉండదు. ప్రతి కుటుంబం తన స్థోమతను దృష్టిలో ఉంచుకుని పిల్లలను ప్లాన్ చేసుకుంటుంది. ఆ విషయాన్ని విస్మరించరాదు.‘‘అన్నీ వేదాలలో ఉన్నాయష’’ అన్న డైలాగు ఒకటి గురజాడ వారి కన్యాశుల్కం నాటకంలో ఉంటుంది. అలాగే దేశంలో కాని, ప్రపంచంలో కాని ఏది జరిగినా దాన్ని తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటే. ఈ మధ్యనే ఆయన ఆవుల నుంచి పాల పిండడం తానే నేర్పించానంటున్నట్లుగా మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. అలాగే ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టులలో మెజార్టీ తానే కట్టానని చెప్పుకున్నారు. అసలు భారీ ప్రాజెక్టులపై అంతగా విశ్వాసం లేని వ్యక్తిగా చంద్రబాబు గుర్తింపు పొందారు. నీటి ఎద్దడికి ఇంకుడు గుంతలే పరిష్కారం అని భావించి గతంలో ఆ కార్యక్రమం అమలు చేశారు. తర్వాత కాలంలో వదలివేశారు. అది వేరే విషయం. ఒకప్పుడు జనాభా నియంత్రణను తానే ప్రోత్సహించానని తాజాగా అన్నారు. ఇద్దరు మించి పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికలలో పోటీకి అనర్హులని తానే చట్టం తెచ్చానని కూడా చెప్పేశారు. నిజానికి 1960, 70 దశకాలలో కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణను ఒక విధానంగా దేశం అంతటా అమలు చేసింది.ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలన్న పాటలు అప్పట్లో బాగా వినిపించేవి. 1994లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య ఇద్దరు పిల్లలు మించి ఉంటే స్థానిక ఎన్నికలలో పోటీకి అనర్హులన్న చట్టాన్ని తీసుకువచ్చారు. ఏ కుటుంబం అయినా స్థానిక ఎన్నికలలో పోటీ చేయడానికి ఎక్కువ మంది పిల్లలను కంటుందా? అసలు విషయానికి వస్తే ఇప్పుడు పిల్లలను ఎక్కువ మందిని కనాలని, అందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని చంద్రబాబు అంటున్నారు. ఈ సమస్య దేశంలో ఎందుకు ప్రధానంగా వచ్చింది. ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువ మంది పిల్లలను కంటుండడం, దక్షిణాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ పద్దతులు పాటిస్తుండడం వల్ల ప్రాంతాల జనాభాలలో బాగా తేడా వచ్చింది.దీని ఫలితంగా లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని, నార్త్ రాష్ట్రాలలో గణనీయంగా సీట్లు పెరిగి వారి పెత్తనం మరింత అధికం అవుతుందన్నది ఆందోళన. దీని గురించి కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన చంద్రబాబు నాయుడు ఆ పని చేయకుండా, ఏపీలో పిల్లలను అధికంగా కనండని చెబుతున్నారు. జపాన్, చైనా తదితర దేశాలతో పోల్చుకుని ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. ఆ దేశాలలో కొంత సమస్య ఉన్నమాట నిజమే కావ,చ్చు. కాని అక్కడి పరిస్థితులు వేరు. ఆ దేశాలు అనుసరిస్తున్న పద్దతులు వేరు. అక్కడ ఎన్ని చర్యలు తీసుకున్నా ఆశించిన రీతిలో జనాభా వృద్ది రేటు ఉండడం లేదు. దానికి అనేక కారణాలు ఉన్న విషయాన్ని అక్కడి ప్రభుత్వాలు గుర్తించాయి.ప్రధానంగా నగరీకరణ, జీవన వ్యయం పెరిగిపోవడం, సాంస్కృతిక, సంప్రదాయాలలో మార్పులు రావడం, పిల్లలను పెంచడంలో ఎదురవుతున్న సమస్యలు, ఉద్యోగాలు పోతాయేమోనన్న భయం, మహిళలు అటు కుటుంబ జీవనం, ఇటు కెరీర్ బ్యాలెన్స్ చేసుకోవడంలో ఎదుర్కుంటున్న ఇబ్బందులు వంటివి ఉన్నాయి. జపాన్‌లో ఒకరికి జన్మనిస్తే ఏభైవేల యెన్ లు ఇవ్వాలన్న స్కీమ్ ఉంది. ఇది ఆదాయ పరిమితి లేకుండా అమలు చేస్తున్నారు. పిల్లల పెంపకం, బేబీ కేర్ సెంటర్ల ఏర్పాటు, ఉన్నత విద్య వరకు ప్రభుత్వమే ఖర్చు భరించడం, అప్పుడే పుట్టిన పిల్లలకు స్ట్రోలర్లు మొదలు డైపర్ల వరకు ప్రభుత్వమే ఇస్తుందట. అయినా జపాన్ లో జనాభా పెరుగుదల పెద్దగా లేదని గణాంకాలు చెబుతున్నాయి. జనాభా పెరిగితే ఎకానమీ కొంత పెరగవచ్చు కాని, దాంతోపాటు అనేక సమస్యలు వస్తున్నాయన్నది నిపుణుల అంచనా. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ వంటి దేశాలలో తక్కువ జనాభాతో మంచి ఆర్థిక ప్రగతిని సాధించాయి.చైనాలో ఒకప్పుడు ఒకరినే కనాలన్న నిబంధన ఉన్నా, దానిని క్రమేపి ముగ్గురికి పెంచారు. అందుకు కారణం వృద్దుల సంఖ్యకు, యువతకు మధ్య సమతుల్యత లేకపోవడమే. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాయి. రిటైర్మెంట్ వయసు పెంచడం, రిటైరైనా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం, వలసలను ప్రోత్సహించడం, ఇతర ప్రోత్సహాకాలు వంటివి చేస్తున్నాయి. జపాన్ వంటి దేశాలలో వలసలు కూడా ఎక్కువగా ఉండడం లేదు. ఏపీ విషయానికి వస్తే, ఒకవైపు అమరావతి పేరుతో కొత్తగా నగరాన్ని నిర్మిస్తానని చెబుతుంటారు. అంటే అర్బనైజేషన్ పెంచడం అన్నమాట. మరోవైపు అర్బనైజేషన్ వల్ల ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. జనాభా కేంద్రీకరణ వల్ల ఢిల్లీ, బెంగుళూరు తదితర నగరాలలో మౌలిక సదుపాయాల మీద ఒత్తిడి పెరుగుతోంది. అందరికి సరిపడా నీటిని సరఫరా చేయడం కష్టం అవుతోంది.అయినా ఒక నగరాన్ని సృష్టించడం అంత తేలిక కాదు.దానంతట అది సహజంగా అభివృద్ది చెందాలి తప్ప. పిల్లలను కంటే జపాన్ లో భారీ మొత్తాన్ని ప్రోత్సాకంగా ఇస్తున్నారు. ఆ పని చంద్రబాబు సర్కార్ చేయగలదా? తల్లికి వందనం పేరుతో విద్యార్దులందరికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల వాగ్దానాలలో చేశారు. దానిని ఒక ఏడాదంతా ఎగవేశారే! ఈ ఏడాది ఇచ్చినా అదేదో కొత్తగా లోకేశ్ కనిపెట్టినట్లు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. గత ముఖ్యమంత్రి జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద ఈ మొత్తాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. పిల్లలకు అబద్దాలు ఆడరాదని బోధించాల్సి చోటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా సత్యదూరం అయిన విషయాలు చెప్పవచ్చా అన్న చర్చ వచ్చింది.ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని హామీ ఇచ్చారు.దాని సంగతేమిటి? ఇదేదో డబ్బు వస్తుందిలే అని నమ్మి మహిళలు ఎక్కువమంది పిల్లలను కంటే వారికి ఇబ్బందే కదా! నిరుద్యోగ భృతి రూ.మూడు వేలు ప్రామిస్ చేశారు. దాని అతీగతి లేదు. ఇలా హామీలను ఎగవేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువ మంది పిల్లలను కంటే ప్రోత్సహకాలు ఇస్తామంటే ఎవరైనా నమ్ముతారా? జపాన్‌లో మహిళల కాన్పునకు అయ్యే వ్యయం అంతా ప్రభుత్వమే భరిస్తుంది. ఏపీలో అలా చేయగలుగుతారా? ఆరోగ్యశ్రీని నీరు కార్చుతున్నారన్న విమర్శలు ఉన్నాయి కదా! పిల్లల చదువుకు ఫీజ్ రీయింబర్స్మెంట్ వంటివి ఎంతో ఉపయోగపడుతున్నాయి. దాని బకాయిల మాటేమిటి? ఇవన్ని పెట్టుకుని పిల్లలను ఎక్కువ మందిని కంటే దేశభక్తులని చెబితే ఎవరు నమ్ముతారు.డబ్బు ఉన్నవారు ఒకరు, ఇద్దరు పిల్లలను మాత్రమే కంటున్నారు. పేదలు ఎక్కువ మందికి జన్మనిస్తే, వారిని పెంచడానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు. వ్యవసాయ కార్మికులు అవసరమైన మేర లభించకపోవడానికి, ఇతరత్రా పనులు చేసేవారు లేక పోవడానికి ఇతర కారణాలు ఉన్నాయి. వ్యవసాయం అంత గిట్టుబాటు కాదని, ఇతర రంగాలకు మళ్లాలని గతంలో ఒకసారి సీఎం అన్నారు. నిజంగానే కూటమి సర్కార్ వచ్చాక వివిధ పంటలకు సరైన ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు.నష్టాల పాలవుతున్నారు. అలాంటప్పుడు ఎక్కువమంది పిల్లలను కనండని రైతులకు, వ్యవసాయ కార్మికులకు చెబితే వారు ఏమని జవాబు ఇస్తారు.. ఇలా నేల విడిచి సాము చేసినట్లు చంద్రబాబు నాయుడు ఏదో ఒక కొత్త డైలాగు తెచ్చి ప్రజలను మభ్యపెట్టడం కాకుండా ఆచరణాత్మక విధానాలవైపు వెళితే మంచిది కదా! పిల్లలను ఎక్కువ మందిని కనడం అన్నది దేశభక్తికి సంబంధించింది కాదు..ఆయా కుటుంబాల ఆర్థిక శక్తికి సంబంధించిన విషయం. తమ కుటుంబాలలో ఆచరించచని పద్దతులను ప్రజలు పాటించాలని చంద్రబాబు వంటివారు చెబితే ఎవరైనా విశ్వసిస్తారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా నిన్న (జులై 14) ముగిసిన మూడో టెస్ట్‌లో (లార్డ్స్) భారత్‌పై ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. లార్డ్స్ టెస్ట్‌లో విజయం సాధించి గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది.ఆ జట్టు ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఎడమ చేతి వేలి ఫ్రాక్చర్ కారణంగా సిరీస్‌లోని తదుపరి రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. బషీర్ చేతి వేలికి ఈ వారం చివర్లో శస్త్రచికిత్స జరుగనున్నట్లు ఈసీబీ తెలిపింది. బషీర్ లార్డ్స్ టెస్ట్‌లో మూడో రోజు తన బౌలింగ్‌లోనే రవీంద్ర జడేజా (తొలి ఇన్నింగ్స్) క్యాచ్ అందుకోబోయి గాయపడ్డాడు. ఆ గాయం తర్వాత బషీర్ ఆ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు.అయితే బషీర్ రెండో ఇన్నింగ్స్‌లో గాయంతో బాధపడుతూనే బ్యాటింగ్‌కు దిగాడు. 9 బంతుల్లో 2 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత బషీర్ ఐదో రోజు ఎక్కువ భాగం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు.అయితే ఛేదనలో టీమిండియా టెయిలెండర్లు అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తున్న దశలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బషీర్‌ను తిరిగి బరిలోకి దించాడు. కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయని బషీర్.. చాలా సేపు తమ సహనాన్ని పరీక్షించిన మహ్మద్ సిరాజ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లండ్ గెలుపును ఖరారు చేశాడు. ఈ సిరీస్‌లో బషీర్ 3 మ్యాచ్‌ల్లో 54.1 సగటున 10 వికెట్లు తీశాడు.బషీర్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగాని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. జాక్ లీచ్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, టామ్ హార్ట్లీ పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. నాలుగో టెస్ట్ జులై 23 నుంచి మాంచెస్టర్‌లో ప్రారంభం కానుంది.కాగా, తాజాగా ముగిసిన లార్ట్స్ టెస్ట్ టీమిండియాకు గుండెకోత మిగిల్చింది. విజయానికి అత్యంత చేరువగా వచ్చినా భారత్‌ను ఓటమే పలకరించింది. ఐదో రోజు చేతిలో 6 వికెట్లతో 135 పరుగులు చేయాల్సిన టీమిండియా లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఆశలు పెట్టుకున్న పంత్, రాహుల్ విఫలం కాగా... 82/7 నుంచి జట్టును గెలిపించేందుకు రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) వీరోచితంగా పోరాడాడు. అయినా లాభం లేకుండా పోయింది.అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీసింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది.

లక్షల మందిని ఊచకోత కోసి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
ఈస్టిండియా కంపెనీ గుర్తుందా? ‘భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన కంపెనీని ఎలా మరిచిపోగలం..’ అని అంటారు కదూ. ప్రస్తుతం ఈ సంస్థ ఒక భారతీయుడి అధీనంలో ఉందని చాలా కొద్ది మందికే తెలిసుంటుంది. ఈస్టిండియా కంపెనీకి ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాణిజ్య సంస్థగా పేరుంది. భారతదేశంపై బ్రిటిష్ సామ్రాజ్య పాలన కీలక ఏజెంట్‌గా ఈ కంపెనీ వ్యవహరించేది. కానీ ఇప్పుడు ఒక భారతీయ వ్యాపారవేత్త యాజమాన్యంలో ఉంది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.ఈస్టిండియా కంపెనీని క్వీన్ ఎలిజబెత్ 1600లో స్థాపించారు. ఈ కంపెనీని మొదట్లో సుగంధ ద్రవ్యాలు, పట్టు, పత్తి, ఇతర వస్తువులను దేశంలోని తూర్పు ప్రాంతాల నుంచి వర్తకం చేసేందుకు ప్రారంభించారు. కాలక్రమేణా ఇది ఒక వాణిజ్య సంస్థగా మారి, తర్వాతి కాలంలో సైనిక, పరిపాలనా శక్తిగా అభివృద్ధి చెందింది. చివరికి భారతదేశంలోని చాలా ప్రాంతాలను అన్యాయంగా తన అధీనంలోకి తీసుకుంది. 1857 తిరుగుబాటు తరువాత, 1874లో బ్రిటిష్ క్రౌన్ కంపెనీని రద్దు చేశారు. భారతదేశంపై ప్రత్యక్ష నియంత్రణ నేరుగా బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేశారు. ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలు ముమ్మరంగా సాగేప్పుడు దాని సొంత ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. సొంతంగా కరెన్సీని ముద్రించింది. లక్షలాది మందిని దోపిడీ చేసింది.ఇదీ చదవండి: ఊగిసలాడుతోన్న పసిడి ధరలు..21వ శతాబ్దంలో యూకేలోని భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త సంజీవ్ మెహతా ఈస్టిండియా కంపెనీ బ్రాండ్‌ను పునరుద్ధరించారు. మెహతా 2005లో ఈస్టిండియా కంపెనీ పేరుపై ట్రేడ్ హక్కులను పొందాడు. అప్పటి నుంచి దాని చారిత్రక మూలాలకు కట్టుబడి లగ్జరీ బ్రాండ్‌గా తీర్చిదిద్దాడు. మెహతా నాయకత్వంలో ఈస్టిండియా కంపెనీ లగ్జరీ టీలు, కాఫీలు, చాక్లెట్లు, మసాలా దినుసులు, ఆహార పదార్థాలను విక్రయించే హైఎండ్ బ్రాండ్‌గా పునర్నిర్మించారు. లండన్‌లోని మేఫేర్లో ఫ్లాగ్షిప్ స్టోర్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థ ప్రపంచ మార్కెట్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.

కాంగ్రెస్ నేత హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, మెదక్: కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కుమారుడికి, అనిల్‌కు మధ్య విబేధాలు ఉన్నాయి. ఓ భూమి విషయంలో గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే కుమారుడి వద్ద అనిల్ రూ.80 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో ఉన్న బెంజ్ కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే కుమారుడిదేనని పోలీసులు అంటున్నారు. గత ఐదు నెలలుగా బెంజ్ కారు అనిల్ వద్దనే ఉంటుందని చెబుతున్నారు.మెదక్ – జోగిపేట ప్రధాన రహదారిపై నిన్న(సోమవారం రాత్రి కాంగ్రెస్ నేత అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. మండలంలోని పైతర గ్రామానికి చెందిన మరెల్లి అనిల్(28)జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. మెదక్ నుంచి స్వగ్రామానికి కారులో ఆయన ప్రయాణమయ్యాడు.చిన్నఘనాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అనిల్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే, అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో నాలుగు బులెట్లు లభ్యమయ్యాయి.

అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి!
ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ మరో ఆసక్తికరమైన, మర్చిపోలేని అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తిపేశ్వర్ (Tipeshwar, Mahatashtra) అడవిలో అద్భుతమైన దృశ్యాలు ఆయన కంటపడ్డాయి. అది చూసి ఆయన హృదయం మైమర్చి పోయిందట. గాలికి ఊగిసలాడే ప్రతీ ఆకు ఒక కథను వినిపిస్తుంది అంటూ పులకించిపోతూ తన అనుభవాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆకు కదలినా వినిపించే నిశ్శబ్ద వాతావరణంలో ఒక్క క్షణ గుండె ఆగిపోయే దృశ్యాన్నిగాంచిన వైనాన్ని పంచుకున్నారు.పులి కనిపించిన ఆ మరపురాని క్షణం-నిశ్శబ్దంగా, రాయల్‌గా తమ కళ్ల ముందునుంచి ఒక పులి వెళ్లిన దృశ్యాలనువర్ణించారు. ఒక్క క్షణం శ్వాసం ఆగిపోయినంత పని. ఇక్కడితో అయిపోలేదు. ఆ క్షణాలను అలా ఆస్వాదిస్తూ ఉండగానే, చిరుతపులి వచ్చింది. తనదైన వేగంగా, అలా కళ్లముందునుంచి శరవేగంగా కదిలిపోయింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే అడవిలో అందం అలా వచ్చి అలా మాయమైపోతుందనేందుకు ఇదే నిదర్శనం అన్నారు.పులి గర్జన చెట్ల గుండా ప్రతిధ్వనిండచమేకాదు మనం రక్షించుకోవాల్సింది , గౌరవించుకోవాల్సింది ఒక భూమిని మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది అనే ఆలోచనను రగిలించింది. అదొ క నిశ్శబ్ద వాగ్దానం. పక్షులతో పాటు ఎన్నో మరెన్నో.. అడవిని సజీవ సింఫొనీగా మలిచే రావాలు. ఇవన్నీ అత్యంత మరపురాని రోజులకు నేపథ్య సంగీతమని చెప్పుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రయాణం కాదు. అంతకుమించినలోతైన అనుభవం అన్నారు. తిపేశ్వర్లో తాము చూసినవి కేవలం జంతువులను కాదు, ప్రకృతి మనకంటే చాలా కాలం ముందు రచించుకున్న కవితలోని పద్యాలు. మనం అదృష్టవంతులైతే ఈ అందమైన ప్రకృతిని సజీవంగా ఉంచడంలో సహాయం లభిస్తుందన్నారు.ఇదీ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్‌లు Lost in the wild heart of Tipeshwar — where every rustling leaf hinted at an untold story, and every shifting shadow held the thrill of the unknown. 🌿🐅That unforgettable moment when the tiger appeared — silent, regal, and commanding — it felt like time held its breath. A gaze… pic.twitter.com/cfZ8nnxjIg— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 15, 2025

కోటి ఖర్చు పెడతా... ట్రాఫిక్ సమస్యను తీర్చేద్దాం!
మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యల గురించి నిత్యం వింటూనే ఉన్నాం.. చినుకుపడితే చాలు.. కిలోమీటర్ల జామ్‌లు.. గతుకుల రోడ్లు, కార్పొరేషన్ల తవ్వకాలు.. పూర్తికాని నిర్మాణాలు..ట్రాఫిక్ చిక్కులకు బోలెడు కారణాలు ఉండవచ్చు కానీ.. పరిష్కార మార్గాలు మాత్రం గగన కుసుమాలే! వీటన్నింటితో ప్రశాంత్ పిట్టి ఎంత విసిగిపోయాడో కానీ.. ఈ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టాల్సిందేనని తీర్మానించాడు! కోటి రూపాయలు ఖర్చు పెడతా కలిసి రండని ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లకు పిలుపునిచ్చాడు!కర్ణాటక రాజధాని బెంగళూరును ఒకప్పుడు ఉద్యాన నగరి అని పిలుచుకునేవారు కానీ ఇప్పుడది వాహనాల పద్మవ్యూహం! అభిమన్యుడు సైతం ఛేదించలేని దుర్భర నరకం! ‘ఈజ్ మై ట్రిప్’ కంపెనీ వ్యవస్థాపకుడిగా ఎందరి ప్రయాణాలనో సులభతరం చేసిన ప్రశాంత్ పిట్టికి కూడా బెంగళూరు ట్రాఫిక్ రోజూ సవాళ్లు విసురుతూనే ఉంది. మొన్నటికి మొన్న శనివారం అర్ధరాత్రి.. 11.5 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 145 నిమిషాల టైమ్ పట్టిందట.ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఉద్దేశించిన ఔటర్ రింగ్ రోడ్డులోనే ఒక చోట సుమారు వంద నిమిషాలు ఇరుక్కుపోయానని, అక్కడ కనీసం ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదా సిగ్నల్ కానీ లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని వాపోయాడు ప్రశాంత్! ఈ జామ్‌లతో విసిగిపోయిన ప్రశాంత్... తన ఎక్స్ అకౌంట్లో ఒక ప్రకటన చేశాడు. ‘‘కోటి రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధం. గూగుల్ మ్యాప్స్, కృత్రిమ మేధల సాయంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్న ప్రాంతాలను గుర్తిద్దాం’’ అని కోరాడు.గూగుల్ మ్యాప్స్‌కు శాటిలైట్ ఇమేజరీ తోడు...ఈ ఏడాది ఏప్రిల్‌లో గూగుల్ మ్యాప్స్ ‘‘రోడ్ మేనేజ్మెంట్ ఇన్సైట్’’ పేరుతో కొన్ని వివరాలు ఇవ్వడం మొదలుపెట్టిన విషయాన్ని ప్రస్తావించాడు ప్రశాంత్. ఏ రోడ్డులో ట్రాఫిక్ ఉన్నదో గుర్తించి ఇంకోమార్గంలో వెళ్లమని సూచిస్తుందన్నమాట ఈ రోడ్ మేనేజ్మెంట్ ఇన్సైట్. దీనికి ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా అందే సమాచారాన్ని జోడించి బెంగళూరు నగరం మొత్తమ్మీద ట్రాఫిక్‌ను అడ్డుకునే ఇరుకు ప్రాంతాలను గుర్తిద్దామని ప్రశాంత్ పిలుపునిచ్చాడు. ఒక నెలరోజులపాటు గమనిస్తే ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందో తెలిసిపోతుందని, ఆ తరువాత ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరించగలరని వివరించాడు.I am committing INR 1 Cr to find Bangalore Choke-Points via Google Maps & AL.11 km → 2.15 hours in Bangalore Traffic on Saturday late night!I was stuck at one choke-point at ORR, where I spent 100 mins struggling to understand why there is no traffic-light or cop here!But… pic.twitter.com/b8Nf5vnUKf— Prashant Pitti (@ppitti) July 14, 2025ఈ పని తన ఒక్కడి వల్లే కాదన్న ఆయన ఒకరిద్దరు ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లు కలిసిరావాలని కోరాడు. గూగుల్ మ్యాప్స్, జీపీయూ, ఏపీఐ కాల్స్, ఉపగ్రహ ఛాయాచిత్రాల కోసం కావాల్సిన మొత్తాలతో కలిపి ఈ ప్రాజెక్టు కోసం కోటి రూపాయల వరకూ తాను ఖర్చు పెడతానని కూడా ప్రకటించాడు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు, కార్పొరేషన్లు ఇప్పటికే సేకరిస్తున్న సమాచారాన్ని అందించడంతోపాటు... తామిచ్చే సలహా, సూచనలను పాటించేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేస్తే చాలు పని మొదలుపెడతానని చెప్పారు.బెంగళూరు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన ఈ ప్రాజెక్టు గురించి కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులకు తెలిసేంతవకూ తన ట్వీట్‌ను ట్యాగ్ చేయాలని పిలుపునిచ్చాడు. అలాగే ఈ పనిలో సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇంజినీర్లు తన ట్వీట్‌కు ‘ఇన్’ అని కామెంట్ చేయాలని, ట్రాఫిక్ కారణంగా సమయం వృథా అవుతోందని భావిస్తున్న వాహనదారులందరూ ట్వీట్‌పై కామెంట్ చేయడంతోపాటు నలుగురికి షేర్ చేయాలని కోరారు. ఆల్ ద బెస్ట్ ప్రశాంత్ పిట్టి!

'రామాయణ' బడ్జెట్ రివీల్ చేసిన నిర్మాత.. మీ ఊహకు కూడా అందదు
రామాయణం మానవ జీవితానికి అవసరమైన విలువలను, మార్గదర్శకత్వాన్ని అందించే ఒక గొప్ప గ్రంథం. మన రాముడి గురించి 'రామాయణ' సినిమా ద్వారా ప్రపంచానికి బాలీవుడ్ చూపనుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్ వర్క్‌పై ప్రశంసలు అందుతున్నాయి. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాల బడ్జెట్ గురించి నమిత్ మల్హోత్రా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.రూ. 4 వేల కోట్ల బడ్జెట్ఇటీవల జరిగిన పాడ్‌కాస్ట్‌లో, నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. రామాయణంలోని రెండు భాగాలకు దాదాపు $500 మిలియన్లు, అంటే దాదాపు రూ. 4000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీంతో రామాయణం అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు విడుదలైన భారతీయ చిత్రాల బడ్జెట్లు ఏవీ 1000 కోట్లు దాటలేదు. ఈ బడ్జెట్‌తో రామాయణం ప్రపంచ సినిమాల్లో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీలలో ఒకటిగా కూడా మారనుంది. ఇప్పటివరకు ఈ చిత్రాల బడ్జెట్ రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు నిర్మాత చెప్పిన లెక్కలు చూస్తుంటే కళ్లు చెదిరేలా ఈ మూవీ ఉండబోతుందని అర్థం అవుతుంది."పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు కలిపి పూర్తయ్యే సమయానికి ఇది దాదాపు $500 మిలియన్లు అవుతుంది, అంటే దాదాపు రూ. 4000 కోట్లు. ప్రపంచం చూడవలసిన గొప్ప కథ రామాయణం. మేము ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నాము. అయితే, ఇది ఇప్పటికీ కొన్ని హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ల కంటే తక్కువేనని నేను భావిస్తున్నాను. తక్కువ ఖర్చుతో పెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నామని నేను భావిస్తున్నాను. ఈ చిత్రం కేవలం డబ్బు కోసమే చేస్తుంది కాదు. ప్రపంచానికి మన రాముడి గురించి చెప్పాలని అనుకున్నాను.' అని నమిత్ అన్నారు. 20కి పైగా భాషలుహాలీవుడ్లోని ఇతర సినిమాల మాదిరిగానే రామాయణం కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 20కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని DC కామిక్స్ హిట్ చిత్రాలు బ్యాట్మన్, సూపర్ మెన్, వండర్ వుమన్ వంటి వాటితో పాటు మార్వెల్ సినిమాలకు తగ్గకుండా రామాయణ ప్రాజెక్ట్ రూపొందించాలని మేకర్స్ యోచిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది.
పోచమ్మ బోనాల పండుగ
అందులో కూర్చుంటే అహంకారం పెరుగుతుందని అలా నిలబడే పాలన చేస్తేన్నారు!
ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నా.. ఐనా సంతోషం నిల్ !
“నేను నిన్ను విడిచి ఉండలేను.. నేను నీ దగ్గరకు వస్తున్నాను’
నిమిష మరణశిక్ష వాయిదా
పల్లెకు పరిచయమైన "వర్చువల్ రియాలిటీ గేమింగ్".. స్పందన మామూలుగా లేదు..!
చంద్రబాబు సర్కార్ మా భూములు లాక్కుంటుంది
నవవధువు చికెన్ తినలేదనే మనస్తాపంతో..
ఫహాద్ ఫాజిల్ మరో డిఫరెంట్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
గండికోటలో దారుణం
ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అప్పుడే..!'
ఆ సినిమాతో కోటకు చేదు అనుభవం.. ఎన్టీఆర్ అలా.. బాలకృష్ణ ఇలా..!
'కోడిని చూస్తూ చికెన్ తినడం'.. ఆ రోల్ కోట చేయాల్సింది కాదు!
అమ్మ మీద ప్రేమ.. ఆ హీరోపై అభిమానం ఎప్పటికీ తగ్గదు: కిరీటి
లారెన్స్‌ను కలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. 'తాగుబోతులకు సాయం చేయనన్నారు'
ఏంటి బ్రో? కొంచెం కూడా సోయి లేదా?.. రాజమౌళికి కోపం తెప్పించిన అభిమాని!
పిల్లల ముందే అసభ్యంగా ప్రవర్తించేసరికి..
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ధనలాభం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Kota Srinivasa Rao: కోట జీవితంలో విషాదం.. ఎన్ని కోట్లు సంపాదిస్తేనేం?
నేను మీ జోలికి రాను.. నా బిడ్డను ఏమీ చేయవద్దు..!
విమానాలే కూలుతున్నాయ్! ఆఫ్ట్రాల్ గోడ కూలితే ఇంత రాద్ధాంతం ఏంటని అంటున్నాడ్సార్!!
తిరుగులేని హీరోయిన్.. పగతో శవాన్ని కూడా వదలని స్టార్ హీరో
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కోర్టు సమన్లు
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక గంట మ్యూజిక్ వినండి చాలు!
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
IND vs ENG 3rd Test: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు బ్రేక్
మల్లన్నపై దాడి.. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయ వేడి
కాపురంలో చిచ్చుపెట్టిన రీల్స్ చిన్నది!
పోచమ్మ బోనాల పండుగ
అందులో కూర్చుంటే అహంకారం పెరుగుతుందని అలా నిలబడే పాలన చేస్తేన్నారు!
ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నా.. ఐనా సంతోషం నిల్ !
“నేను నిన్ను విడిచి ఉండలేను.. నేను నీ దగ్గరకు వస్తున్నాను’
నిమిష మరణశిక్ష వాయిదా
పల్లెకు పరిచయమైన "వర్చువల్ రియాలిటీ గేమింగ్".. స్పందన మామూలుగా లేదు..!
చంద్రబాబు సర్కార్ మా భూములు లాక్కుంటుంది
నవవధువు చికెన్ తినలేదనే మనస్తాపంతో..
ఫహాద్ ఫాజిల్ మరో డిఫరెంట్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
గండికోటలో దారుణం
ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అప్పుడే..!'
ఆ సినిమాతో కోటకు చేదు అనుభవం.. ఎన్టీఆర్ అలా.. బాలకృష్ణ ఇలా..!
'కోడిని చూస్తూ చికెన్ తినడం'.. ఆ రోల్ కోట చేయాల్సింది కాదు!
అమ్మ మీద ప్రేమ.. ఆ హీరోపై అభిమానం ఎప్పటికీ తగ్గదు: కిరీటి
లారెన్స్‌ను కలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. 'తాగుబోతులకు సాయం చేయనన్నారు'
ఏంటి బ్రో? కొంచెం కూడా సోయి లేదా?.. రాజమౌళికి కోపం తెప్పించిన అభిమాని!
పిల్లల ముందే అసభ్యంగా ప్రవర్తించేసరికి..
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ధనలాభం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Kota Srinivasa Rao: కోట జీవితంలో విషాదం.. ఎన్ని కోట్లు సంపాదిస్తేనేం?
నేను మీ జోలికి రాను.. నా బిడ్డను ఏమీ చేయవద్దు..!
విమానాలే కూలుతున్నాయ్! ఆఫ్ట్రాల్ గోడ కూలితే ఇంత రాద్ధాంతం ఏంటని అంటున్నాడ్సార్!!
తిరుగులేని హీరోయిన్.. పగతో శవాన్ని కూడా వదలని స్టార్ హీరో
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కోర్టు సమన్లు
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక గంట మ్యూజిక్ వినండి చాలు!
IND vs ENG 3rd Test: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు బ్రేక్
మల్లన్నపై దాడి.. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయ వేడి
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
కాపురంలో చిచ్చుపెట్టిన రీల్స్ చిన్నది!
సినిమా

షాక్‌లో నటి కయాదు లోహర్.. అయ్యో పాపం అంటూ నెటిజన్లు
కోలీవుడ్ సినిమా 'డ్రాగన్'లో ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా నటి అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ నటించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అయితే అందులో నటించిన ఇద్దరు హీరోయిన్లలో నటి కయాదు లోహర్ ( Kayadu Lohar)కు అనూహ్యంగా క్రేజ్ వచ్చింది. దీంతో తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు వరుస కట్టాయి. ముఖ్యంగా డ్రాగన్ చిత్రానికి ముందే అధర్వకు జంటగా ఇదయం మురళి అనే చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. ఆ తరువాత జీవీ ప్రకాశ్‌కు జంటగా ఒక చిత్రం, నటుడు శింబు సరసన పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో ఒక చిత్రం, ధనుష్‌కు జతగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో మరో చిత్రంలో నటించే అవకాశాలు తలుపు తట్టాయి. దీంతో నటి కయాదు లోహర్ పంట పండింది. ఆమె క్రేజ్ మామూలుగా లేదంటూ ప్రచారం జరిగింది.అయితే స్టార్ హీరోలు శింబు, ధనుష్ చిత్రాల్లో నటించే అవకాశాలు చేజారిపోయాయి. ఇప్పుడు ధనుష్‌కు జంటగా నటించే అవకాశాన్ని నటి మమితా బైజూ తన్నుకుపోయారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అదే విధంగా శింబు సరసన నటించే అవకాశం కోల్పోయినట్లు తాజా సమాచారం. కయాదు లోహర్ ఎంత వేగంగా దూసుకొచ్చారో అంత వేగంగా వెనక్కు తగ్గారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అనుకున్నవన్నీ జరగవని అంటూనే తనకు మంచి భవిష్యత్ ఉందంటూ పేర్కొంటున్నారు. ప్రస్తుతం తమిళంలో అధర్వకు జంటగా నటిస్తున్న ఇదయం మురళి, మలయాళంలో టోవినో థామస్‌కు జంటగా నటిస్తున్న చిత్రం మాత్రమే కయాదు లోహర్ చేతిలో ఉన్నాయి. ఇది ఆమె కెరీర్‌కు పెద్ద షాకే అంటున్నారు సినీ వర్గాలు. అయితే, సరైన టీమ్ తనవద్ద లేకపోవడమే ఇలా వచ్చిన ఛాన్స్‌లు కోల్పోవాల్సి వచ్చిందని మరికొందరు అంటున్నారు. మొత్తానికి అయ్యో పాపం అంటూ కయాదు లోహర్ఫై నెటిజన్లు సింపతీ చూపుతున్నారు.

సంజయ్ దత్ కోపం.. తప్పు సరిదిద్దుకుంటానని లోకేశ్ కామెంట్
కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సినిమాలకు తెలుగులో కూడా భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో వంటి సినిమాలతో ఆయన పాపులర్ అయ్యారు. ప్రస్తుతం రజినీకాంత్‌తో 'కూలీ' తీస్తున్నాడు. అయితే, కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక వేదికపై మాట్లాడుతూ.. లోకేశ్‌పై తనకు కోపం ఉందని, లియో సినిమాలో పెద్ద పాత్ర ఇవ్వలేదన్నాడు. తన సమయాన్ని వృథా చేశాడని సరదాగా నవ్వుతూ అన్నాడు. దీంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో లోకేశ్ స్పందించారు.సంజయ్ దత్ వ్యాఖ్యలపై లోకేశ్ కనగరాజ్ ఇలా అన్నారు. ' సంజయ్ సార్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. "నేను ఫన్నీగా కామెంట్ చేశాను, కానీ సోషల్ మీడియాలో మరో రకంగా ఈ వ్యాఖ్యలు వెళ్లాయి. తర్వాత ఇబ్బందిగా అనిపించింది" అని అన్నాడు. అప్పుడు నేను కూడా పర్వాలేదు సార్ ఇలాంటివి సహజమేనని చెప్పాను. నేను గొప్ప ఫిల్మ్ మేకర్ని కాదు, ఇంకా నేర్చుకోవడంలోనే ఉన్నాను. భవిష్యత్తులో సంజయ్ దత్‌కు అత్యుత్తమమైన పాత్రను రెడీ చేస్తాను. మరో సినిమాతో తప్పు సరిదిద్దుకుంటాను.' అని లోకేశ్ అన్నారు.Q: SanjayDutt said that you wasted him in #LEO❓#Lokesh: SanjayDutt called me & said "I commented funny, but it felt awkward after social media comments". I'm not a greatest filmmaker, it's all learning. Hopefully I will make best out of him in future😀 pic.twitter.com/GCtuyHbSih— AmuthaBharathi (@CinemaWithAB) July 14, 2025

'హరిహర వీరమల్లు' ప్రీరిలీజ్ ఈవెంట్ ప్రకటన
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను వేకర్స్ ఫైనల్ చేశారు. జులై 24న పాన్ ఇండియా రేంజ్‌లొ విడుదల కానున్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 20న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి రానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా రన్‌టైమ్: 2:42 నిమిషాలు ఉన్నట్లు పేర్కొంది.గతంలో ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించాలనుకున్నారు. అప్పుడు సినిమా వాయిదా పడటంతో ఈ కార్యక్రమం కూడా ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా విశాఖను ఎంచుకున్నారు. ఈ సినిమాకి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించనున్నారు.

'రామాయణ' బడ్జెట్ రివీల్ చేసిన నిర్మాత.. మీ ఊహకు కూడా అందదు
రామాయణం మానవ జీవితానికి అవసరమైన విలువలను, మార్గదర్శకత్వాన్ని అందించే ఒక గొప్ప గ్రంథం. మన రాముడి గురించి 'రామాయణ' సినిమా ద్వారా ప్రపంచానికి బాలీవుడ్ చూపనుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్ వర్క్‌పై ప్రశంసలు అందుతున్నాయి. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాల బడ్జెట్ గురించి నమిత్ మల్హోత్రా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.రూ. 4 వేల కోట్ల బడ్జెట్ఇటీవల జరిగిన పాడ్‌కాస్ట్‌లో, నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. రామాయణంలోని రెండు భాగాలకు దాదాపు $500 మిలియన్లు, అంటే దాదాపు రూ. 4000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీంతో రామాయణం అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు విడుదలైన భారతీయ చిత్రాల బడ్జెట్లు ఏవీ 1000 కోట్లు దాటలేదు. ఈ బడ్జెట్‌తో రామాయణం ప్రపంచ సినిమాల్లో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీలలో ఒకటిగా కూడా మారనుంది. ఇప్పటివరకు ఈ చిత్రాల బడ్జెట్ రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు నిర్మాత చెప్పిన లెక్కలు చూస్తుంటే కళ్లు చెదిరేలా ఈ మూవీ ఉండబోతుందని అర్థం అవుతుంది."పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు కలిపి పూర్తయ్యే సమయానికి ఇది దాదాపు $500 మిలియన్లు అవుతుంది, అంటే దాదాపు రూ. 4000 కోట్లు. ప్రపంచం చూడవలసిన గొప్ప కథ రామాయణం. మేము ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నాము. అయితే, ఇది ఇప్పటికీ కొన్ని హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ల కంటే తక్కువేనని నేను భావిస్తున్నాను. తక్కువ ఖర్చుతో పెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నామని నేను భావిస్తున్నాను. ఈ చిత్రం కేవలం డబ్బు కోసమే చేస్తుంది కాదు. ప్రపంచానికి మన రాముడి గురించి చెప్పాలని అనుకున్నాను.' అని నమిత్ అన్నారు. 20కి పైగా భాషలుహాలీవుడ్లోని ఇతర సినిమాల మాదిరిగానే రామాయణం కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 20కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని DC కామిక్స్ హిట్ చిత్రాలు బ్యాట్మన్, సూపర్ మెన్, వండర్ వుమన్ వంటి వాటితో పాటు మార్వెల్ సినిమాలకు తగ్గకుండా రామాయణ ప్రాజెక్ట్ రూపొందించాలని మేకర్స్ యోచిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 114 ఏళ్ల దిగ్గజ మారథాన్ రన్నర్
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్‌గా పేరొందిన ఫౌజా సింగ్ 114 ఏళ్ల వయసులో ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం జలంధర్-పఠాన్‌కోట్ హైవేపై కారు ఢీకొనడంతో ఫౌజా సింగ్ తలకు తీవ్ర గాయమైంది. ఫౌజాను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రాణాలు వదిలారు.ఫౌజా సింగ్ మృతదేహాన్ని విదేశాల్లో నివసిస్తున్న అతని పిల్లలు వచ్చే వరకు మార్చురీలో ఉంచనున్నారు. వారు వచ్చిన తర్వాతే అతని అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఫౌజా సింగ్ మరణం పట్ల పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫౌజా కుటుంబానికి, అతని అభిమానులకు సానుభూతి తెలియజేశారు. ఫౌజా ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.114 ఏళ్ల వయసులోనూ ఫౌజా తన బలం మరియు నిబద్ధతతో తరతరాలను ప్రేరేపించాడని అన్నారు. గతేడాది 'నాషా ముక్త్ - రంగాలా పంజాబ్' మార్చ్‌లో ఫౌజాతో పాటు నడిచే గౌరవం లభించిందని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు గులాబ్ చంద్ కటారియా తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.కాగా, ఫౌజా సింగ్ 1911 ఏప్రిల్ 1న పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించారు. భార్య, కొడుకు మరణంతో ఫౌజా సింగ్ మానసిక సమస్యలతో పోరాడుతూ 1992లో మరాథాన్వైపు మళ్ళారు. అప్పటి నుంచి ఫౌజా మారథాన్‌లో సంచలన ప్రదర్శనలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఫౌజా సింగ్ లండన్, టొరంటో, న్యూయార్క్ వంటి ప్రముఖ అంతర్జాతీయ మారథాన్లలో పాల్గొన్నారు. 42 కిలోమీటర్ల మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు టొరంటో మారథాన్‌ను 5 గంటలు 44 నిమిషాలు 4 సెకన్లలో ముగించి రికార్డు నెలకొల్పాడు.ఫౌజా 2004 ఏథెన్స్ మరియు 2012 లండన్ ఒలింపిక్స్ లకు టార్చ్ బేరర్ గా ఉన్నాడు. దిగ్గజ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హమ్, బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీతో కలిసి ఓ ప్రధాన క్రీడా బ్రాండ్ కోసం ప్రకటనలో కనిపించారు.

వేలంలో రికార్డు ధర పలికిన అవినాశ్
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ నాలుగో సీజన్లో తలపడే జట్ల ఆటగాళ్ల వేలంలో ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్ల కంటే గ్రేడ్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అత్యధిక మొత్తాల్ని వెచ్చించాయి. 520 మంది ఆటగాళ్లను వారి స్థాయిని బట్టి నాలుగు కేటగిరిల్లో ఉంచారు. అంతర్జాతీయ, ఐపీఎల్లో ఆడిన ఆటగాళ్లను ప్రత్యేక కేటగిరిగా తొమ్మిది మందిని ఉంచగా వారిలో ఎనిమిది మందిని ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. ఇలా రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రికీబుయ్కి అత్యధికంగా రూ.10.26 లక్షలు ఇచ్చారు. అయితే వేలంలో ఆల్రౌండర్లను దక్కించుకునే యత్నంలో ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్లకంటే ఎక్కువ మొత్తాల్ని మిగతా గ్రూపుల ఆటగాళ్లకు వెచ్చించారు. అవినాశ్‌కు అత్యధికంగా రూ.11.05 లక్షలు పి.అవినాశ్ ఏకంగా 11.05 లక్షలు ధర పలికాడు. మార్కీ ఆటగాళ్ల కేటగిరిలో ఉన్న హనుమ విహారీని అమరావతి రాయల్స్, అశ్విన్ హెబ్బర్‌ను విజయవాడ సన్‌షైనర్స్, షేక్ రషీద్‌ను రాయల్స్ రాయలసీమ, కె.ఎస్.భరత్‌ను కాకినాడ కింగ్స్, నితీశ్ కుమార్‌ను భీమవరం బుల్స్ జట్లు పదేసి లక్షలతో వేలానికి ముందే దక్కించుకోగా సిహెచ్ స్టీఫెన్‌ను ఏడులక్షలకు, కేవి శశికాంత్‌ను ఐదు లక్షలకు తుంగభద్ర వారియర్స్ దక్కించుకుంది. ఇక ఈ కేటగిరిలో రికీబుయ్‌ను అత్యధిక ధరతో సింహాద్రి వైజాగ్ లయన్స్ దక్కించుకుంది. మార్కీ ప్లేయర్లగా ఏ గ్రేడ్‌లో ఉన్న అవినాశ్‌ను రూ.11.05 లక్షల అత్యధిక ధరతో రాయల్స్ రాయలసీమ దక్కించుకోగా పివి సత్యనారాయణ రాజును రూ.9.8 లక్షలకు భీమవరం బుల్స్, టి.విజయ్ను 7.55 లక్షలకు సింహాద్రి వైజాగ్ లయన్స్ వేలంలో దక్కించుకున్నాయి. ఆగస్టు 8 నుంచి 23వరకు నాలుగో సీజన్ ఏపీఎల్ నాలుగో సీజన్ ఆగస్టు 8వ తేదీ నుంచి 23 వరకు వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనుంది. ఈసారి నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లతో పాటు మొత్తంగా 25 మ్యాచ్‌లు జరగనుండగా ఏడు జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి.

ఓ పక్క స్టార్క్ మహోగ్రం.. మరో పక్క బోలాండ్ విశ్వరూపం
వెస్టిండీస్‌తో జరిగిన జమైకా టెస్ట్‌లో ఆసీస్ పేసర్లు చెలరేగిపోయారు. ఓ పక్క మిచెల్ స్టార్క్ మహోగ్రరూపం (7.3-4-9-6), మరో పక్క స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ ప్రదర్శన ధాటికి విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 27 పరుగులకే కుప్పకూలి, టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఫలితంగా 176 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పాటు 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయింది.ఈ మ్యాచ్‌లో 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. స్టార్క్‌తో పాటు స్కాట్ బోలాండ్ అటాక్ చేయడంతో కేవలం 14.3 ఓవర్లలోనే తమ పోరాటాన్ని ముగించింది. స్టార్క్ 15 బంతుల వ్యవధిలో (W 0 0 0 W W 0 0 0 0 0 0 W 2 W) 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. బోలాండ్ తనవంతుగా హ్యాట్రిక్ వికెట్లతో విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో బోలాండ్ వరుసగా 1, 2, 3 బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసఫ్, జోమెల్ వార్రికన్ను పెవిలియన్‌కు పంపాడు. తద్వారా టెస్ట్‌ల్లో ఆసీస్ తరఫున 10వ హ్యాట్రిక్ నమోదు చేసిన ఆటగాడిగా, డే అండ్ నైట్ టెస్ట్‌ల్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లు వేసిన బోలాండ్ కేవలం 2 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున హ్యాట్రిక్ తీసిన బౌలర్లు..ఫ్రెడ్రిక్ స్పోఫోర్త్హగ్ ట్రంబల్జిమ్మీ మాథ్యూస్లిండ్సే క్లైన్మెర్వ్ హ్యూస్డేమియన్ ఫ్లెమింగ్షేన్ వార్న్గ్లెన్ మెక్గ్రాత్పీటర్ సిడిల్స్కాట్ బోలాండ్చరిత్ర సృష్టించిన బోలాండ్జమైకా టెస్ట్‌లో స్కాట్ బోలాండ్ (Scott Boland) సరికొత్త చరిత్ర సృష్టించాడు. 1915 తర్వాత టెస్టు క్రికెట్లో కనీసం 2000 డెలివరీలు సంధించిన బౌలర్లలో అత్యుత్తమ సగటు కలిగిన ఆటగాడిగా నిలిచాడు. బోలాండ్ తన నాలుగేళ్ల కెరీర్లో 14 టెస్ట్‌ల్లో 16.53 సగటుతో 62 వికెట్లు తీశాడు. ఈ ఆల్‌టైమ్ రికార్డు ఇంగ్లండ్‌కు ఆడిన సిడ్నీ బార్న్స్ పేరిట ఉంది. బార్న్స్ 1901- 1914 మధ్యలో ఇంగ్లండ్ తరఫున16.43 సగటుతో వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మిచెల్ స్టార్క్ విలయతాండవం ధాటికి విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్లయ్యారు. జాన్ క్యాంప్‌బెల్, కెవియోన్ ఆండర్సన్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, షమార్ జోసఫ్, జోమెల్ వార్రికన్, జేడన్ సీల్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు. విండీస్ ఇన్నింగ్స్‌లో కేవలం జస్టిన్ గ్రీవ్స్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. స్టార్క్‌తో పాటు స్కాట్ బోలాండ్ (2-1-2-3), హాజిల్‌వుడ్ (5-3-10-1) కూడా విజృంభించడంతో విండీస్ టెస్ట్ క్రికెట్లో తమ అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది.అంతకుముందు ఆసీస్ కూడా రెండో ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. అల్జరీ జోసఫ్ (12-2-27-5), షమార్ జోసఫ్ (13-4-34-4), జస్టిన్ గ్రీవ్స్ (4-0-19-1) చెలరేగారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెమరూన్ గ్రీన్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.దీనికి ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లోనూ 143 పరుగులకే చాపచుట్టేసింది. ఆసీస్ బౌలర్లంతా మూకుమ్మడిగా చెలరేగారు. బోలాండ్ 3, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో 2, స్టార్క్, వెబ్‌స్టర్ చెరో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో జాన్ క్యాంప్‌బెల్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 225 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (46), స్టీవ్ స్మిత్ (48) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో షమార్ 4, సీల్స్, గ్రీవ్స్ తలో 3 వికెట్లు తీశారు.

బీభత్సం సృష్టించిన స్టార్క్.. క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్‌కు కుప్పకూలిన వెస్టిండీస్
కింగ్స్టన్, జమైకా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నామమాత్రపు మూడో టెస్ట్‌లో ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ బీభత్సం సృష్టించాడు. నిప్పులు చెరిగే బంతులతో విలయతాండవం చేశాడు. స్టార్క్ దెబ్బకు వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులకే కుప్పకూలింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోర్. ఈ ఇన్నింగ్స్‌లో స్టార్క్ కేవలం 15 బంతుల వ్యవధిలో (W 0 0 0 W W 0 0 0 0 0 0 W 2 W) 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా నమోదైన ఐదు వికెట్ల ఘనత ఇదే.🚨 MITCHELL STARC: 7.3-4-9-6 🥶🔥- WEST INDIES BOWLED OUT FOR JUST 27 RUNS IN THE SECOND INNINGS....!!!! pic.twitter.com/Z3tFsjJalT— Johns. (@CricCrazyJohns) July 15, 2025ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 7.3 ఓవర్లు వేసిన స్టార్క్ కేవలం 9 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఫలితంగా వెస్టిండీస్ 204 పరుగుల లక్ష్య ఛేదనలో 27 పరుగులకే ఘోరంగా కుప్పకూలి 176 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఈ గెలుపుతో ఆసీస్ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. ఇదే మ్యాచ్‌లో స్టార్క్ మరో ఘనత కూడా సాధించాడు. టెస్ట్‌ల్లో 400 వికెట్ల మైలురాయిని (402) అధిగమించాడు. పింక్ బాల్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన స్టార్క్.. పింక్ బాల్‌తో తన గణాంకాలను మరింత మెరుగుపర్చుకున్నాడు.పింక్ బాల్‌తో మొత్తం 14 టెస్ట్‌లు ఆడిన స్టార్క్ 17.08 సగటున ఐదు 5 వికెట్ల ప్రదర్శనలతో 81 వికెట్లు తీశాడు.ఏడుగురు డకౌట్లుమిచెల్ స్టార్క్ విలయతాండవం ధాటికి విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్లయ్యారు. జాన్ క్యాంప్‌బెల్, కెవియోన్ ఆండర్సన్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, షమార్ జోసఫ్, జోమెల్ వార్రికన్, జేడన్ సీల్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు. విండీస్ ఇన్నింగ్స్‌లో కేవలం జస్టిన్ గ్రీవ్స్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. స్టార్క్‌తో పాటు స్కాట్ బోలాండ్ (2-1-2-3), హాజిల్‌వుడ్ (5-3-10-1) కూడా విజృంభించడంతో విండీస్ టెస్ట్ క్రికెట్లో తమ అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది.అంతకుముందు ఆసీస్ కూడా రెండో ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. అల్జరీ జోసఫ్ (12-2-27-5), షమార్ జోసఫ్ (13-4-34-4), జస్టిన్ గ్రీవ్స్ (4-0-19-1) చెలరేగారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెమరూన్ గ్రీన్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.దీనికి ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లోనూ 143 పరుగులకే చాపచుట్టేసింది. ఆసీస్ బౌలర్లంతా మూకుమ్మడిగా చెలరేగారు. బోలాండ్ 3, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో 2, స్టార్క్, వెబ్‌స్టర్ చెరో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో జాన్ క్యాంప్‌బెల్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 225 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (46), స్టీవ్ స్మిత్ (48) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో షమార్ 4, సీల్స్, గ్రీవ్స్ తలో 3 వికెట్లు తీశారు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు (ఓ ఇన్నింగ్స్‌లో)..న్యూజిలాండ్- 26వెస్టిండీస్- 27సౌతాఫ్రికా- 30సౌతాఫ్రికా- 30సౌతాఫ్రికా- 35
బిజినెస్

నేపాల్‌లో రిలయన్స్ సాఫ్ట్‌డ్రింక్స్
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ ‘కాంపా కోలా’ను నేపాల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందుకోసం కంపెనీ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్), నేపాల్‌కి చెందిన చౌదరి గ్రూప్‌తో (సీజీ) ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫుడ్, బెవరేజెస్ విభాగంలో క్యాంపా ఉత్పత్తుల తయారీ, దేశవ్యాప్తంగా పంపిణీకి సీజీ తోడ్పడుతుంది.కాంపా పోర్ట్‌ఫోలియో కింద తొలుత కాంపా కోలా, కాంపా లెమన్, కాంపా ఆరెంజ్, కాంపా ఎనర్జీ గోల్డ్ బూస్ట్, కాంపా ఎనర్జీ బెర్రీ కిక్ ఉత్పత్తులను ప్రవేశపెడతారు. ప్రాంతీయంగా మరింత వృద్ధి సాధించే దిశగా దీర్ఘకాలిక విజన్‌తో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆర్సీపీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేతన్ మోదీ తెలిపారు. తమ బెవరేజ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని సీజీ గ్రూప్ ఎండీ నిర్వాణ చౌదరి చెప్పారు. ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?2022లో కాంపా బ్రాండ్‌ను రిలయన్స్ కొనుగోలు చేసింది. 2023లో దాన్ని దేశీ మార్కెట్లో సరికొత్తగా ప్రవేశపెట్టింది. అటు సీజీ గ్రూప్ అంతర్జాతీయంగా 200 పైగా కంపెనీలు, 260 పైచిలుకు బ్రాండ్లను నిర్వహిస్తూ నేపాల్‌లో అగ్రగామిగా నిలుస్తోంది. భారత్ సహా పలు దేశాల్లో అమ్ముడయ్యే ‘వై వై’ బ్రాండ్ ఇన్స్టంట్ నూడుల్స్ ఈ సంస్థకు చెందినవే.

నిలకడగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:47 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు పెరిగి 25,094కు చేరింది. సెన్సెక్స్(Sensex) 37 ప్లాయింట్లు ఎగబాకి 82,297 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ట్రంప్ టారిఫ్‌లు.. మన ఎగుమతులకు మంచిదే
న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో భారత ఎగుమతులు మరింత పోటీతత్వంగా మారినట్టు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. చైనా, కెనడా, మెక్సికోలపై ట్రంప్ సర్కారు అధిక టారిఫ్‌లు విధించడం మనకు అనుకూలిస్తుందని పేర్కొంది. సంఖ్యా పరంగా, విలువ పరంగా అమెరికా మార్కెట్లో భారత ఎగుమతులకు గణనీయమైన అవకాశాలున్నట్టు తెలిపింది. ‘‘30కు గాను 22 విభాగాల్లో భారత పోటీతత్వం పెరగనుంది. ఈ విభాగాల మార్కెట్ పరిమాణం 2,285 బిలియన్ డాలర్లుగా ఉంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. ఈ విభాగాల్లో అమెరికాకు చైనా, కెనడా, మెక్సికో ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్నట్టు తెలిపింది. ఈ దేశాలపై 30 శాతం, 35 శాతం, 25 శాతం చొప్పున అధిక సుంకాల బాదుడుతో భారత ఎగుమతుల పోటీతత్వం పెరగనున్నట్టు అంచనా వేసింది. ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రికల్ మెషినరీ తదితర విభాగాల్లో మార్కెట్ వాటా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇక 30కు గాను 6 విభాగాల్లో భారత పోటీతత్వంలో ఎలాంటి మార్పు ఉండబోదని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతుల్లో వీటి వాటా 32.8 శాతంగా (26.5 బిలియన్ డాలర్లు) ఉంటుందని తెలిపింది. ‘‘ఆరు ఉత్పత్తుల విభాగాల్లో భారత్ 1–3 శాతం మేర అధిక టారిఫ్‌లను ఎదుర్కోనుంది. యూఎస్‌కు భారత ఎగుమతుల్లో 52 శాతం వాటా కలిగిన 78 ఉత్పత్తుల విభాగాల్లో పోటీతత్వం పెరగనుంది. 17 ఉత్పత్తుల విభాగాల్లో ఎలాంటి మార్పు ఉండదు’’అని వివరించింది. ఈ రంగాలకు సానుకూలం.. చైనా, కెనడా, మెక్సికోలపై టారిఫ్‌లతో పోల్చి చూస్తే.. భారత మినరల్స్, ఇంధనాలు, వ్రస్తాలు, ఎల్రక్టానిక్స్, ప్లాస్టిక్స్, ఫరి్నచర్, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ప్రయోజనం చేకూరనున్నట్టు నీతి ఆయోగ్ తన నివేదికలో విశ్లేషించింది. ఎంఎస్ఎంఈలకు మద్దతుగా నిలిచేందుకు, ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచేందుకు వీలుగా ఉత్పత్తి అనుసంధాన ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించింది. లెదర్, ఫుట్‌వేర్, ఫరి్నచర్, హ్యాండిక్రాఫ్ట్స్‌కు సైతం పీఎల్ఐ కింద మద్దతు ఇవ్వాలని పేర్కొంది. అలాగే, విద్యుత్ టారిఫ్‌లను తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించింది. దీనివల్ల తయారీ వ్యయాలు తగ్గుతాయని వివరించింది. ఐటీ, ఆర్థిక సేవలు, నైపుణ్య సేవలు, విద్యా రంగాలను దృష్టిలో పెట్టుకుని అమెరికాతో సేవల ఆధారిత వాణిజ్య ఒప్పందానికి కృషి చేయాలని సూచించింది.

హెచ్‌సీఎల్ టెక్ లాభం డౌన్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 3,843 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 4,257 కోట్లు ఆర్జించింది. అధిక వ్యయాలు, క్లయింట్ దివాలా లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 30,349 కోట్లను తాకింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు రికార్డ్ డేట్ జూలై 18కాగా.. 28కల్లా చెల్లించనుంది. ఈ కాలంలో 1,984 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించింది. అయితే త్రైమాసికవారీగా మొత్తం ఉద్యోగుల సంఖ్య 269 తగ్గి 2,23,151కు చేరింది. 3–5 శాతం వృద్ధిపూర్తి ఏడాదికి ఆదాయంలో 3–5 శాతం వృద్ధి సాధించగలమని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా అంచనా(గైడెన్స్) ప్రకటించింది. ఉద్యోగులు, ఇతర అంశాలలో పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయకుమార్ పేర్కొన్నారు. ఏఐ విభాగంలో మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణకు తెరతీసినట్లు తెలియజేశారు. గైడెన్స్‌ను సాధించే బాటలో భారత్‌కు వెలుపలగల ప్రాంతాలలో కేంద్రాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఉద్యోగులను తగ్గించుకోవడం చేపట్టనున్నట్లు వివరించారు. తద్వారా మార్జిన్లను 18–19 శాతానికి పెంచుకోనున్నట్లు తెలియజేశారు. క్యూ1లో నిర్వహణ లాభ మార్జిన్లు 16.3 శాతానికి పరిమితమైనట్లు వెల్లడించారు. యుటిలైజేషన్ తగ్గడం, జెన్ఏఐ, జీటీఎం పెట్టుబడులు ప్రభావం చూపినట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు బీఎస్ఈలో 1 శాతం నష్టంతో రూ. 1,620 వద్ద ముగిసింది.
ఫ్యామిలీ

రొయ్యలకు ప్రత్యామ్నాయం ‘పాంపనో’!
పంట మార్పిడి చెయ్యటం అనేది పంట పొలాల్లో మాదిరిగానే ఆక్వా సాగులోనూ అత్యవసరమైన విషయమే. తీరప్రాంతాల్లోని ఉప్పునీటి చెరువుల్లో వనామీ తదితర ఉప్పునీటి రొయ్యలకు ప్రత్యామ్నాయంగా పంట మార్పిడి చేయటానికి అవకాశాలు చాలా తక్కువ. సముద్రంలో పెరిగే జలజీవులను ఉప్పు నీటి చెరువుల్లో పెంచడాన్ని మారికల్చర్ అంటారు. ఈ దిశగా కేంద్రీయ సముద్ర చేపల పరిశో«ధనా సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ), జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(ఎన్ఎఫ్డీబీ) వంటి సంస్థల శాస్త్రవేత్తలు, అధికారుల కృషి ఫలితంగా రెండు సముద్ర చేపలు ఏపీ తీరప్రాంత చెరువుల్లో సాగులోకి వచ్చాయి. ఈ కోవలో మొదటిది సీబాస్ (పండుగప్ప)కు తాజాగా సముద్ర చేప పాంపనో (చందువా పార)తోడైంది.‘చందువా జాతికి చెందినదే పాంపనో కూడా. ఒకే ముల్లు ఉంటుంది. అయితే, పాంపనో చేప ముల్లు మరింత గట్టిగా ఉంటుంది. అంతే తేడా’ అని సీఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మెగారాజన్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 2016లో పాంపనో పిల్లల ఉత్పత్తి సాంకేతికతను రూపొందించటంతో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఆ నేపథ్యంలోనే పాంపనో సాగును కృష్ణా తదితర జిల్లాల్లో అనేక చోట్ల 2020 తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) తోడ్పాటుతో ప్రోత్సహించామని, వందెకరాల్లో సాగవుతోందన్నారు. పాంపనో చేపల రుచి హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో చేపల వినియోగదారులకు ఇప్పటికే తెలుసు. తద్వారా పాంపనో చేపలకు మంచి మార్కెట్ ఉందని డా. మెగారాజన్ అన్నారు. సముద్రంలో చందువాల సంఖ్య తగ్గిపోవటంతో పాంపనో చేపలను చెరువుల్లో పెంచటం ద్వారా ఆక్వా రైతులు ఆదాయం పొందవచ్చన్నారు. పాంపనో సీడ్ ఉత్పత్తి సాంకేతికతను ఆర్నెల్ల క్రితమే ఒక ప్రైవేటు హేచరీకి సీఎంఎఫ్ఆర్ఐ బదిలీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఏర్పాటైన ఈ హేచరీ ఇప్పటికే పాంపనో సీడ్ ఉత్పత్తి ప్రారంభించింది. ఉప్పునీటి రొయ్యల చెరువుల్లో వైట్‌స్పాట్ వంటి వ్యాధులు అదుపులో ఉండాలంటే పంట మార్పిడి చేయాలి. అందుకు అన్ని విధాలా అనువైనది పాంపనో చేప. ఇప్పుడు సీడ్ అందుబాటులోకి రావటంతో పాంపనో సాగు విస్తరించే అవకాశం ఉందని అన్నారాయన.మూల పొలంలో పాంపనో సాగు!శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మూలపొలం గ్రామంలోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్డీబీ)కి చెందిన ఇంటిగ్రేటెడ్ కోస్టల్ ఆక్వాకల్చర్ ఫెసిలిటీలోని చెరువుల్లో తొలిసారి సముద్ర చేపలు పాంపనో (చందువా పార), సీబాస్ (పండుగప్ప) సాగును ప్రారంభించారు. రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి చేయడానికి 2008లో 97.45 ఎకరాల భూమిని ఎన్ఎఫ్డీబీకి ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్ల క్రితం వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదించడంతో ప్రాజెక్టు తొలి దశకు అడుగు ముందుకు పడింది. నర్సరీ చెరువులు, కల్చరల్ చెరువులు, సముద్రపు నీటిని తీసుకురావడం, బయటకు పంపించడం, వడపోత వ్యవస్థలు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక చెరువులో తొలిసారి 2024 జూలైలో పాంపనో (చందువా పార) సాగు టెక్నికల్ కన్సల్టెంట్ ఆంజనేయులు ప్రారంభించారు. చేప పిల్లలను సీఎఫ్టీఆర్ఐ ద్వారా తెచ్చి, రెండు నెలలు సీడ్ ట్యాంకుల్లో పెంచి, తర్వాత పెంపకపు చెరువులోకి మార్చారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు అ«ధికారులు, శాస్త్రవేత్తల సలహాతో 25 సెంట్ల చెరువులో 3 వేల పిల్లలను విడిచి పెట్టారు. 8 నెలలు పెంచిన తరువాత గత నెల 29న 900 కిలోల పాంపనో చేపల్ని పట్టుబడి చేసి విక్రయించారు. ఇంకో 900 కిలోల చేపలు ఉన్నాయి. అధిక విస్తీర్ణంలో సాగు చేయటం లాభదాయకమేనన్నారు. పాంపనో సాగులో నష్టం వచ్చే అవకాశాలు తక్కువన్నారు. చెరువు నీటిలో పాంపనో సాగు మొదటిసారి విజయవంతం కావడంతో అధికారులు ఆంజనేయులును అభినందించారు. ప్రస్తుతం మరో రెండు చెరువుల్లో పండుగప్ప చేపలను సాగు చేస్తున్నారు. అధికారులు, శాస్త్రవేత్తల మార్గదర్శ కత్వంలో టెక్నికల్ కన్సల్టెంట్ కె. ఆంజనేయులు పాంపనో మొదటి చేపల సాగు జయప్రదమైంది. దీంతో ఈ ప్రాంత ఆక్వా రైతుల్లో రొయ్యలకు ప్రత్యామ్నాయంగా సముద్ర చేపల సాగుపై ఆశలు రేకెత్తుతున్నాయి. పాంపనో సాగులో రిస్క్ తక్కువ! ఇండియన్ పాంపనో (చందువా పార) నీటిలో ఉప్పదనం 5 నుంచి 40 పిపిటి వరకు తట్టుకొని పెరుగు తుంది. ఉప్పునీటి రొయ్యలకు ప్రత్యామ్నాయంగా సాగు చేయొచ్చు. పండుగప్ప పెద్ద చేపలు చిన్న చేపలను తినేస్తాయి. అయితే, పాంపనోతో ఆ సమస్య లేదు. రొయ్యలకు మాదిరిగా ప్రాణాంతక వ్యాధులు ముసురుకోవు. వ్యాధుల రిస్క్ తక్కువ. 10 గ్రా./2 అంగుళాల పిల్లలను చెరువులో వేసుకుంటే.. 5–6 నెలల్లో 500–600 గ్రా. బరువు పెరుగుతాయి. పెల్లెట్ల మేతను చక్కగా తింటాయి. రైతుకు కిలో రూ. 350–450 ధర వస్తుంది. రైతులకు మంచి నికరాదాయం వస్తుంది. పాంపనో సాగు 3 కోస్తా జిల్లాల్లో మొదలైంది. వచ్చే ఐదేళ్లలో బాగా ప్రాచుర్యంలోకొస్తుంది. – డా. మెగారాజన్ (95057 68370) సీనియర్ శాస్త్రవేత్త, ఈఎంఎఫ్ఆర్ఐ ప్రాంతీయ కార్యాలయం, విశాఖపట్నం2 కిలోల మేతకు కిలో చేపసముద్రపు జాతుల చేపలను ఉప్పునీటి చెరువుల్లో పెంచ డాని (మారికల్చర్)కి అనుభవంతో పాటు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు శ్రద్ధగా పాటించటం అవసరం. ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న భూమిలో పనులు మొదలుపెట్టి అధికారులు అప్పగించిన లక్ష్యాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉంది. 25 సెంట్ల చెరువులో సాధారణంగా వెయ్యి పాంపనో పిల్లలు వేస్తారు. అయితే, అధికారులు, శాస్త్రవేత్తల సలహాతో అధిక సాంద్రతలో 3 వేల పిల్లలను పెంచాం. కిలో చేప పెరగడానికి రెండు కిలోల మేత అవసరమైంది. పిల్లలన్నీ చక్కగా పెరగటం సంతృప్తినిచ్చింది. మరో రెండు చెరువుల్లో పండుగప్ప చేపలను సాగు చేస్తున్నాం. మున్ముందు ఈ చేపల పిల్లలను ఉత్పత్తి చేసి ఆక్వా రైతులకు విక్రయిస్తాం. – కె.ఆంజనేయులు, టెక్నికల్ కన్సల్టెంట్, ఎన్ఎఫ్డీబీ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ ఆక్వాకల్చర్ ఫెసిలిటీ, మూలపొలం, శ్రీకాకుళం జిల్లా – పిరియ ధర్మేంద్ర, సాక్షి, సోంపేట, శ్రీకాకుళం జిల్లా

ఆ కంటిచూపు మన వెన్నంటి
‘శ్రీరామాంజనేయ యుద్ధం’లో సీత... ఆ కళ్లల్లో కరుణ ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో సుభద్ర... ఆ కళ్లల్లో ఆత్మవిశ్వాసం... పాత్రల్లోనేనా... పాటల్లోనూ ఆ కళ్లు ఎన్నో భావాలు పలికించాయి. ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’.... ఆ కళ్లు వెచ్చని హాయిని కనబర్చాయి... ‘గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి’.... ఆ కళ్లల్లో కవ్వింపు... ఇలా వెండితెరపై ఆమె కళ్లు జీవించాయి. అందుకే తెలుగులో ‘జగదేక నటి’, మాతృభాష కన్నడంలో ‘అభినయ సరస్వతి’, తమిళంలో ‘కన్నడత్తు పైంగిళి’ (కన్నడ చిలుక). బి. సరోజా దేవి కళ్లు ఇక విశ్రమించాయి... అవి కనబర్చిన అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో జీవించే ఉంటాయి. ప్రముఖ నటి బి. సరోజా దేవి (87) సోమవారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా ఆమె కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. బెంగళూరులోని మల్లేశ్వరంలో గల తన స్వగృహంలో సోమవారం ఎప్పటిలాగే ఉదయాన్నే నిద్రలేచిన సరోజా దేవి పూజ చేసి, టీవీ ఆన్ చేసి, కుర్చీలో కూర్చొని ఉండగా అస్వస్థతకు గురయ్యారని, సమీపంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమాలంటే ఇష్టం లేని ఓ తార ‘చతుర్భాష తారె’(నాలుగు భాషల తార)గా కితాబులు అందుకున్నారు. అవును... బి. సరోజా దేవికి సినిమాలంటే ఇష్టం లేదు. అయితే ఆమె తండ్రి భైరప్పకు నటనంటే ఇష్టం. వృత్తిరీత్యా ఆయన పోలీసు అయినప్పటికీ ఓ నాటక సంస్థలో నాటకాల్లో నటించేవారు. చిన్నప్పుడు సరోజా దేవితో కూడా నటింపజేసి, మురిసిపోయారు. బెంగళూరులో 1938లో జనవరి 7న సరోజా దేవి జన్మించారు. ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు కాగా సరోజా దేవి ఆఖరి అమ్మాయి. మగపిల్లలు లేకపోవడంతో ఆమెకి అబ్బాయిలా డ్రెస్సులు వేసేవారు. దాంతో స్కూల్లో అబ్బాయిలు వెక్కిరిస్తే... ఇంటికొచ్చి ఏడ్చిన కూతురితో ‘కావాలంటే మీరూ అమ్మాయిలా బట్టలేసుకోండి’ అని చెప్పు అంటూ ఆమె తల్లి రుద్రమ్మ ఆత్మవిశ్వాసం నూరిపోశారు.టీనేజ్‌లో వెండితెరపై...ఓవైపు చదివిస్తూ మరోవైపు కూతురితో నాటకాల్లో నటింపజేశారు భైరప్ప. పదిహేడేళ్ల వయసులో సరోజాదేవి నటించిన ఒక నాటకం చూసి, కన్నడ దర్శక–నిర్మాత హొన్నప్ప భాగవతార్ ఆమెకు ‘మహాకవి కాళిదాశ’ (1955) సినిమాలో అవకాశం ఇచ్చారు. జాతీయ అవార్డు సాధించిన ఆ చిత్రంతో సరోజా దేవికి మంచి పేరు వచ్చింది. నిజానికి సరోజా దేవిని నటిని చేయాలనుకుని, డ్యాన్స్ కూడా నేర్పించారు భైరప్ప. డ్యాన్స్ ప్రాక్టీస్ అప్పుడు కుమార్తె కాళ్లు వాచిపోతే, ఓపికగా మసాజ్ చేసేవారట. అలాగే రుద్రమ్మ మాత్రం ఎప్పటికీ స్విమ్ సూట్ ధరించకూడదని, స్లీవ్‌లెస్ బ్లౌజులు వేయకూడదని కూతురికి నిబంధన విధించారట. తన కెరీర్ మొత్తంలో ఆ నిబంధనను పాటించారు సరోజా దేవి. ‘మహాకవి కాళిదాస’ తమిళంలో ‘మహాకవి కాళిదాస్’గా అనువాదమై, 1956లో విడుదలైంది. ఆ రకంగా తమిళ పరిశ్రమ దృష్టి సరోజా దేవిపై పడింది. విశేషం ఏంటంటే... తమిళంలో రిలీజైన నాలుగేళ్లకు శివాజీ గణేశన్, షావుకారు జానకిల కాంబినేషన్లో ‘మహాకవి కాళిదాస్’ (1966)గా రీమేక్ కూడా చేశారు. ఇక తమిళంలో ‘తిరుమణమ్’ (1956)లో నటించే అవకాశం సరోజా దేవికి దక్కింది. ఆ తర్వాత వరుసగా కన్నడ, తమిళ చిత్రాలు చేస్తున్న ఆమెకు తెలుగు నుంచి ఆహ్వానం అందింది. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘పాండురంగ మహత్మ్యం’ (1957)లో నటించే చాన్స్ అందుకున్నారు సరోజ. ఏ భాషలో నటిస్తే అది ఆమె మాతృభాష ఏమో అనిపించేలా నటన ఉండటంతో తెలుగు, తమిళ, కన్నడంలో వరుసగా ఆఫర్స్ వచ్చి, బిజీ తారగా మారిపోయారు. అలా ఆమె ‘పైఘమ్, ససురాల్’ తదితర హిందీ చిత్రాల్లోనూ నటించారు.తెలుగులో పాతిక వరకూ... తెలుగులో ఓ పాతిక సినిమాలు చేశారు సరోజ. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎక్కువ చిత్రాలు చేశారామె. వాటిలో ‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ, శ్రీరామాంజనేయ యుద్ధం, దాన వీర శూర కర్ణ’ వంటివి ఉన్నాయి. అలాగే అక్కినేని సరసన ‘శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, అమర శిల్పి జక్కన్న’ వంటివి చేశారు. ‘ఆత్మ బలం’లో ఏఎన్నార్‌తో కలిసి ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ పాటలో సరోజ వేసిన స్టెప్స్, కళ్లల్లో పలికించిన రొమాన్స్‌కి నాటి ప్రేక్షకులు ‘భేష్’ అన్నారు. ఈ ‘చిటపట చినుకులు...’ పాటలో ఆమె తలకు స్కార్ఫ్ కట్టుకుని కనబడతారు. దానికో కథ ఉంది... అదేంటంటే...ట్రెండ్ అయిన స్కార్ఫ్ ‘చిటపట..’ చిత్రీకరించే ముందు సరోజ ఓ హిందీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఆ షూట్లో భాగంగా నెత్తిపై పాల కడవ పెట్టుకుని నడుస్తుంటే, ఆకతాయిలు ఆమెపై రాళ్లు విసురుతూ ఆట పట్టిస్తారు. ఓ రాయి సరిగ్గా సరోజ ముఖానికి తగిలి, గాయాలయ్యాయి. అదే సమయానికి ఇటు ఏఎన్నార్ కాంబినేషన్లో ‘చిట పట..’ పాట షూట్లో పాల్గొనాలి. దాంతో ముఖంపై మచ్చలు కనబడనివ్వకుండా స్కార్ఫ్‌తో మేనేజ్ చేశారు. ఆ తర్వాత ఆ స్కార్ఫ్ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిపోవడం విశేషం. ఇక తనకు బాగా నచ్చిన పాటల్లో ‘చిట పట’ ఒకటని సరోజ పలు సందర్భాల్లో చె΄్పారు.సరోజ చీరలు ఫేమస్ 1960లలో సరోజా దేవి ధరించిన చీరలు, జాకెట్టులు, నగలు, హెయిర్ స్టైల్‌కి ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఆ తరం అమ్మాయిలు ఆమె స్టైల్‌ని, మేనరిజమ్స్‌ని ఫాలో అయ్యేవారు. ముఖ్యంగా తమిళ చిత్రాలు ‘ఎంగ వీట్టు పిళ్లై, అన్బే వా’లోని చీరలు, నగలను ఫాలో అయ్యారు. బిజీగా ఉన్నప్పుడే వివాహం 1955లో నటిగా పరిచయమై, అక్కణ్ణుంచి పదేళ్లు బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలో సరోజా దేవికి ఇంజినీర్ శ్రీహర్షతో 1967లో పెళ్లయింది. పెళ్లయ్యాక సినిమాలు చేయాలా? వద్దా? అనే మీమాంసలో పడ్డారట సరోజ. అయితే భర్త శ్రీహర్ష ప్రోత్సాహంతో సినిమాల్లో కొనసాగారు సరోజ. ఇక ఆమె భర్త అనారోగ్యం బారిన పడక ముందు ‘లేడీస్ హాస్టల్’ (1985) అనే కన్నడ సినిమా అంగీకరించారు. ఆ సినిమా అప్పుడే శ్రీహర్ష అనారోగ్యానికి గురి కావడంతో ఆమె షూటింగ్స్‌కి దూరమయ్యారు. చివరికి 1986లో భర్త చనిపోవడంతో ఆమె ఏడాది పాటు షూటింగ్స్‌కి దూరంగా ఉండటంతో పాటు కుటుంబ సభ్యులు కానివారిని కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఏడాది తర్వాత ‘లేడీస్ హాస్టల్’ సినిమాతో పాటు అప్పటికే అంగీకరించిన ఎనిమిది చిత్రాలను పూర్తి చేశారామె. ఆ తర్వాత ఐదేళ్లు బ్రేక్ తీసుకున్నారు. ఫస్ట్ కన్నడ ఫిమేల్ సూపర్ స్టార్ నిర్మాతలు, అభిమానుల కోరిక మేరకు మళ్లీ కథానాయికగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత క్యారెక్టర్ నటిగానూ చేశారు. దాదాపు 200 చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన చివరి కన్నడ చిత్రం ‘నట సార్వభౌమ’ (2019). కన్నడంలో ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ రికార్డ్ ఆమెదే. ఇక వరుసగా 150కి పైగా చిత్రాల్లో కథానాయికగా నటించడం ఓ అరుదైన ఘనత.జాతీయ అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా... 1998, 2005లో సరోజా 45వ జాతీయ సినిమా అవార్డు, 53వ జాతీయ సినిమా అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. కర్నాటక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి అధ్యక్షురాలిగా, కన్నడ చలన చిత్ర సంఘ ఉపాధ్యక్షురాలిగానూ చేశారు. ఇక 60వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సరోజా దేవిని ‘జీవిత సాఫల్య’ పురస్కారంతో సత్కరించింది. అలాగే అంతకు ముందు 1969లో ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’, 1992లో ‘పద్మభూషణ్’ పురస్కారాలు అందుకున్నారామె. ఇంకా కన్నడ, తెలుగు, తమిళ రాష్ట్రాలకు చెందిన పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఈ అభినయ సరస్వతికి దక్కాయి.చివరి కోరిక అదే ఇప్పటివరకూ సరోజకు రీప్లేస్‌మెంట్‌గా మరో తార రాలేదు... భవిష్యత్తులోనూ రాకపోవచ్చు. అయితే ఆ కళ్లు కొన్నేళ్ల పాటు చూస్తుంటాయి. ఎందుకంటే మరణించిన తర్వాత నేత్రదానం చేయాలన్నది సరోజ చిట్ట చివరి కోరిక. కుటుంబ సభ్యులు ఆ కోరికను నెరవేర్చారు. ఇక... నటిగా ఆ కళ్లు ప్రేక్షకుల హృదయాల్లో జీవించే ఉంటాయి.నేడు అంత్యక్రియలు సరోజ మృతి పట్ల పలువురు కన్నడ, తెలుగు, తమిళ తదితర భాషల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళ వారం సరోజా దేవి స్వగ్రామం రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా దశవార గ్రామంలో ఒక్కలిగ సామాజిక వర్గ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆ కళ్లల్లో ఆరిన తడి సరోజా దేవికి ఇద్దరు కూతుళ్లు (ఇందిర, భువనేశ్వరి), ఒక కుమారుడు (గౌతమ్ రామచంద్రన్‡). కాగా భువనేశ్వరి అనారోగ్యంతో కన్నుమూయడం సరోజా దేవికి ఓ షాక్. అలాగే 1986లో ఆమె భర్త కూడా చనిపోయారు. ‘నా అనుకున్నవాళ్లు నా కళ్ల ముందే దూరం కావడం నాకు బాధగా అనిపించింది’ అంటూ ఆమె కంట తడిపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక భర్త చనిపోయాక సరోజా దేవికి కంటి సమస్య వచ్చింది. బాగా ఏడవడం వల్ల కళ్ల తడి ఆరిపోయి, ‘డ్రై ఐస్’తో బాధపడ్డారామె. చాన్నాళ్లపాటు ఆమెను ఈ బాధ వెంటాడింది. దీన్నిబట్టి భర్త పట్ల సరోజా దేవికి ఎంత మమకారం ఉండేదో ఊహించవచ్చు., ఇక కుమార్తె భువనేశ్వరి పేరిట అవార్డు ప్రవేశపెట్టి, సాహిత్య రంగంలో ప్రతిభావంతులకు అందజేస్తూ వచ్చారు.ఆ ముగ్గురి జోడీ హిట్ అటు కన్నడ స్టార్ రాజ్‌కుమార్ ఇటు తెలుగు స్టార్ ఎన్టీఆర్ మరోవైపు తమిళ స్టార్ ఎంజీ రామచంద్రన్‌లకు జోడీగా సరోజా దేవి ఎక్కువ సినిమాల్లో నటించారు. ఈ ముగ్గురు హీరోలు–సరోజాదేవిది ‘హిట్ పెయిర్’. జయలలిత తర్వాత ఎంజీఆర్‌కి జోడీగా ఎక్కువ సినిమాల్లో నటించిన రికార్డ్ సరోజా దేవిదే. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘నాడోడి మన్నన్’ బ్లాక్ బస్టర్. సరోజా దేవికి ఎంజీఆర్ అంటే చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే... తన తనయుడికి ఆయన పేరు వచ్చేట్లుగా ‘గౌతమ్ రామచంద్రన్’ అని పెట్టుకున్నారు. ఇక ఇంకో విశేషం ఏంటంటే.... తమిళ హీరో శివాజీ గణేశన్‌తో బ్యాక్ టు బ్యాక్ 22 హిట్ చిత్రాల్లో నటించారు సరోజా దేవి. వాటిలో ‘తంగమలై రహస్యం, భాగ పిరవినై, పార్తాల్ పసి తీరుమ్’ వంటివి ఉన్నాయి. అలాగే జెమినీ గణేశన్‌తో 15కి పైగా తమిళ చిత్రాల్లో నటించారు. ముద్దు మాటల ముద్దుగుమ్మసరోజా దేవి మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయి. చిన్నపిల్లలు మాట్లాడినట్లే. అయితే తన సహజ ధోరణి అది అని, కావాలని మాట్లాడలేదని ఓ ఇంటర్వ్యూలో సరోజా దేవి పేర్కొన్నారు. ప్రేక్షకులు తన మీద అభిమానంతో అలా ముద్దు మాటలు అనేవారని ఆమె అన్నారు.గాసిప్ లేని నటిదాదాపు ఏడు దశాబ్దాల కెరీర్లో నాలుగు (కన్నడ, తెలుగు, తమిళ, హిందీ) భాషల్లో ఎందరో స్టార్ హీరోల సరసన నటించారు సరోజా దేవి. అయితే ఏ ఒక్క హీరోతోనూ తనకు లింకులు పెట్టి వదంతులు రాకపోవడం తన అదృష్టం అని ఓ సందర్భంలో సరోజా దేవి తెలిపారు. అలా గాసిప్ లేని నటి అనిపించుకోవడం తన పుణ్యం అని కూడా అన్నారామె.శక్తిమంతమైనస్త్రీ పాత్రల్లో ...1824లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన భారతీయ వీర వనిత కిత్తూరు చెన్నమ్మ పాత్రను చేశారు సరోజా దేవి. ‘కిత్తూరు రాణి చెన్నమ్మ’ టైటిల్‌తో రూపొందిన ఆ చిత్రంలో సరోజా దేవి అభినయం అద్భుతం. ఆ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. అలాగే ‘చింతామణి, శకుంతల’ వంటి కన్నడ చిత్రాల్లోనూ తెలుగులో ‘పండంటి కాపురం, గృహిణి’ తదితర చిత్రాల్లోనూ శక్తిమంతమైన స్త్రీ పాత్రలు పోషించి, మెప్పించారు. – డి.జి. భవాని

సువాసనలు గుర్తించేలా అంధులకు శిక్షణ
భారతదేశంలోని ప్రముఖ ధూపద్రవ్య బ్రాండ్ అయిన ఐటీసీ మంగళ్‌దీప్ స్పెషల్లీ ఏబుల్డ్ దృష్టిలోపి ఉన్నవారికోసం సిక్స్త్ సెన్స్ ప్యానెల్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే సువాసనలను గుర్తించేలా దృష్టి లోపంతో ఉన్న వ్యక్తులను భాగస్వామాన్ని మరింత బలోపేతం చేసింది. మంగళ్‌దీప్ సిక్స్త్ సెన్స్ ప్యానెల్‌ను 180 మందికి విస్తరించింది. విభిన్న, విశిష్ట విద్యా, వృత్తిపరమైన నేపథ్యాల నుండి వీరిని ఎంపిక చేసింది.దృష్టి లోపం ఉన్నవారికి అధికంగా వాసనలను పసిగట్టే జ్ఞానం ఉంటుందని వైద్యపరంగా నిరూపితమైంది. ఈ నేపథ్యంలో భగవంతుడికి, భక్తులకు మధ్య వారధిగా ఉండే ఒక పవిత్రమైన కార్యంలో సువాసన టెస్టింగ్‌లో అంధులకు భాగస్వామ్యం కల్పించింది. 2021లో తీసుకొచ్చిన సిక్స్త్ సెన్స్ ప్యానెల్ కార్యక్రమం కింద ప్రత్యేక సువాసన శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన 30 మంది దృష్టి లోపం ఉన్న వ్యక్తులను ఇటీవల సత్కరించింది. చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లలో 180 మందికి పైగా సభ్యులకు శిక్షణ ఇచ్చినట్టు మంగళ్దీపి వెల్లడించింది. అప్పటి నుండి ఈ ప్యానెల్ ఉత్పత్తి ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించింది, శాండల్, రోజ్, లావెండర్, మ్యారిగోల్డ్ వంటి అనేక ప్రత్యేకమైన,సువాసన వేరియంట్లను మంగళ్‌దీప్ విడుదల చేయటంలో తోడ్పాటు అందించినట్టు తెలిపింది.ఈ కార్యక్రమం గురించి ఐటిసి లిమిటెడ్‌లోని అగర్బత్తి & మ్యాచ్‌ల వ్యాపారం డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ గౌరవ్ తాయల్ మాట్లాడుతూ, “సిక్స్త్ సెన్స్ ప్యానెల్ 4 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఎంపిక చేసిన సువాసలు, అభివృద్ధి, మెరుపుపర్చడం అనేది, సహజంగా వాసనలను పసిగట్టడంలో ఎక్కువ పవర్ ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేయటం వల్ల సాంప్రదాయ పరీక్షా పద్ధతులకు మించి విలువైన ధృక్పథం అలవడింన్నారు. రాబోయే రోజుల్లో తమ సంస్థలో మరింత మందిని తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ధూప్ స్టిక్స్, ఫ్లోరా అగర్బత్తిస్, ప్రీమియం కప్పులు, సాంబ్రాణి స్టిక్స్ వంటి మంగళ్‌దీప్, కీలక ఉత్పత్తులతో ముడి పదార్థాలు, మిశ్రమ అనుభవాల ద్వారా ఫ్రూటీ, ఫ్లోరల్, వుడీ, హెర్బల్/మింట్ ,ఔధ్/అంబర్ వంటి ప్రధాన సువాసనలను గుర్తించడంలో శిక్షణ నిచ్చారు. ప్యానెల్ సభ్యులు నెలవారీ సువాసన పరీక్షలలోపాల్గొనడానికి, వివరణాత్మక అభిప్రాయాన్ని అందించడానికి వీలుగా నిర్మాణాత్మక ఉత్పత్తి మూల్యాంకన ప్రోటోకాల్‌లు అందిస్తారు. "ఐటిసి సిక్స్త్ సెన్స్ ప్యానెల్లో భాగం కావడం నిజంగా సాధికారత కల్పించే అనుభవమనీ,. దృష్టి లోపం ఉన్న సమాజానికి అర్థవంతమైన స్వరాన్ని అందించే ప్రాజెక్ట్‌కు సహకరించడం గౌరవంగా ఉందని మాజీ బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ విజేత & మహనవ్ ఎబిలిటీ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మహేందర్ వైష్ణ కొనియాడారు.ఈ శిక్షణ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, రేడియో ఉడాన్ సహ వ్యవస్థాపకురాలు శ్రీమతి మినల్ సింఘ్వి ఐటీసీకి ధన్యవాదములు తెలిపారు.

ఇష్టమైన గులాబ్ జామ్‌లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గాడు!
అధిక బరువుని సులభంగా తగ్గించుకుని స్మార్ట్‌గా మారిన ఎన్నో స్ఫూర్తిదాయక కథలు విన్నాం. ఎన్నో విభిన్న డైట్లతో తేలిగ్గా కొలెస్ట్రాల్‌ని మాయం చేసుకుని ఫిట్‌గా మారారు. ఇక్కడున్న వ్యక్తి తనకిష్టమైన స్వీట్‌ని త్యాగం చేయకుండానే ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అస్సలు అదెలా సాధ్యమైదనేది అతడి మాటల్లోనే తెలుసుకుందామా..!ప్రసిద్ధ యూట్యూబర్ ఆశిష్ చంచలానీకి ఎక్కువగా చిన్నారులు, యువకులు అతడి అభిమానులు. అతడు మంచి టైమింగ్ కామెడీకి ప్రసిద్ధి. అదే అతడికి వేలాది అభిమానులను సంపాదించి పెట్టింది. అలాంటి వ్యక్తి జస్ట్ ఆరు నెలల్లో 40 కిలోలు తగ్గాడు. ఒక్కసారిగా మారిన అతడి బాడీ ఆకృతి అదరిని ఫిదా చేసింది. అబ్బా అంతలా ఎలా బరువు తగ్గాడని ఏంటా డైట్ సీక్రెట్ అని ఆరా తీయడం ప్రారంభించారు. అయితే ఆశిష్ స్వయంగా ఆ సీక్రెట్ ఏంటో స్వయంగా వెల్లడించారు. నిజానికి ఆయన దగ్గర దగ్గరగా 130 కిలోలు పైనే బరువు ఉండేవాడు. తన 30వ పుట్టనరోజున తన ఆరోగ్యానికి ప్రాధానత ఇచ్చేలా స్మార్ట్‌గా మారిపోవాలని గట్టిగా తీర్మానం చేసుకున్నాడట. అయితే తన బరువు, ప్రకారం తనను తాను అద్దంలో చూసుకుంటే చాలా బాధగా అనిపించిందట. అలా అని నోరు కట్టేసుకునేలా ఆహారాన్ని పూర్తిగా తగ్గించలేడట ఆశిష్. దాంతో ఆహారాన్ని సర్దుబాటు చేసుకున్నాడట. అంటే..తనకు నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండా క్రమబద్ధమైన జీవనశైలిని అనుసరిచడం అన్నమాట. తనకు నచ్చిన గులాబ్ జామ్‌లు ఆస్వాదిస్తూ డైట్ ఎలా తీసుకోవాలో ప్లాన్ చేసుకున్నారట. అందుకోసం ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఎంచుకున్నారు. తన ఆహారంలో తప్పనిసరిగా ప్రోటీన్ పుష్కలంగా ఉండేలా జాగ్రత్త పడేవాడట. ఫైబర్, కార్బోహైడ్రేట్లు తన డైట్ జాబితాలో చివరి ప్రాధాన్యత అని చెబుతున్నాడు ఆశిష్. డైట్ విధానం..అల్పాహారం: ఆశిష్ కనీసం ఆరు ఉడికించిన గుడ్లు లేదా కొన్నిసార్లు వెరైటీగా ఆమ్లెట్, కాల్చిన మొలకలు తీసుకుంటాడు. లంచ్ఆశిష్ భోజనంలో 200 గ్రాముల చికెన్‌తో పాటు ఒక రోటీ ఉండేది, సలాడ్ ఎక్కువగా దోసకాయ, సెలెరీ జ్యూస్‌తో ఉంటుంది.స్నాక్స్సాయంత్రం స్నాక్స్ కోసం, ఆశిష్ వ్యాయామం చేస్తున్నందున సాయంత్రం 6 గంటలకు క్రమం తప్పకుండా పాలవిరుగుడు ప్రోటీన్ తీసుకుంటాడు.విందుఆశిష్ విందు కూడా ప్రోటీన్‌తో నిండి ఉండేది - రోటీ లేదా రైస్ వంటి కార్బోహైడ్రేట్లు లేకుండా గ్రిల్డ్ లేదా రోస్ట్ చేసిన చికెన్. బర్న్ చేసే కేలరీల సంఖ్య, తినే కేలరీలను బ్యాలెన్స్ చేసుకుంటూ బరువు తగ్గారట. తింటున్న ప్రతిదాన్ని లెక్కించేవాడట.. అలా తన ప్లేట్‌ని చూడగానే ఎంత కేలరీల మొత్తంలో ఆహారం తీసుకోవాలో అర్థమయ్యేదట.అప్పడప్పుడు చీట్‌మీల్..ఆశిష్ తనకు బాగా ఇష్టమైన డెజర్ట్‌లు తినకుండా ఉండలేడట. అందుకనే టీ, గులాబ్ జామున్లు, రసమలై వంటి స్వీట్లను వదులుకోలేదని చెప్పాడు. అయితే తన కేలరీలను కూడా పర్యవేక్షించడం ఎప్పటికీ మిస్ అయ్యేవాడు కాదట.(చదవండి: ఆ నింగే పెళ్లికి సాక్ష్యం అంటూ ఆ జంట..!)
ఫొటోలు
అంతర్జాతీయం

‘మాది జీరో.. ఖర్చంతా మీదే’.. ఉక్రెయిన్‌కు ట్రంప్ షాక్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన రెండవ దఫా పాలనలో వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవి కొన్ని దేశాలకు షాకిస్తున్నాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఉక్రెయిన్‌కు పిడుగుపాటులా మారింది. ట్రంప్ తన తాజా ప్రకటనలో ఉక్రెయిన్‌కు నూతన ఆయుధాలు సమకూర్చేందుకు అమెరికా ‘జీరో డాలర్లు’ ఖర్చు చేస్తుందని, అందుకు అయ్యే ఆర్థిక భారాన్ని యూరోపియన్ యూనియన్(ఈయూ) మోయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు రాబోయే కాలంలో పంపించే ఆయుధాల బిల్లును అమెరికా భరించబోదని, ఆ ఆర్థిక బాధ్యత ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌పైనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇందుకోసం మేము జీరో డాలర్లు ఖర్చు చేస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 2022లో రష్యా దండయాత్రను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు సైనిక, మానవతా సహాయాలను అందించడంలో అమెరికా కీలకపాత్ర పోషించింది. అయితే ఇకపై అలాంటి సహాయం అందబోదని ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. 🚨 JUST IN: President Trump announces that the United States is spending 0 DOLLARS on the upcoming weapons to Ukraine.The EUROPEAN UNION will."That's the way it SHOULD'VE BEEN a long time ago.""The European Union is paying for it. We're not paying ANYTHING. It'll be… pic.twitter.com/pHlBm3zg5J— Eric Daugherty (@EricLDaugh) July 14, 2025యూరోపియన్ దేశాలు ప్రాంతీయ భద్రతను పరిపుష్టం చేసేందుకు మరింతగా సాయం అందించాలని అమెరికాను కోరిన దరిమిలా అధ్యక్షుడు ట్రంప్ తన దీర్ఘకాల వైఖరిని వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న నిరంతర దాడిపై స్పందించిన ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం. కాగా ట్రంప్ తాజా ప్రకటన కొత్త చర్చకు దారితీసింది. తన ప్రత్యర్థి రష్యా దురాక్రమణను ఎదుర్కొనేందుకు అమెరికా సైనిక మద్దతుపై ఎక్కువగా ఆధారపడుతున్న ఉక్రెయిన్‌కు ఇది పిడుగుపాటులా పరిణమించింది. అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై యూరోపియన్ యూనియన్ ఇంకా స్పందించలేదు.

ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అధ్యక్షుడికి గాయాలు
టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌ను అంతమొందించేందుకు గత నెలలో ఇజ్రాయెల్ ప్రయత్నించిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో ఆయన స్వల్ప గాయాలతో బయపడ్డట్లు వివరించింది.వివరాల ప్రకారం.. జూన్ 15వ తేదీన పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలీబా, న్యాయ వ్యవస్థ చీఫ్ మొహసేనీ ఇజేయ్తోపాటు ఇతర సీనియర్ అధికారులు టెహ్రాన్‌లో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఉండగా ఇజ్రాయెల్ దాడి చేసిందని ఐఆర్జీసీ అనుబంధ ఫార్స్ న్యూస్ ఆదివారం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో అధ్యక్షుడు మసౌద్.. స్వల్ప గాయాలతో బయపడ్డట్లు వివరించింది. ఇక, తనపై దాడిని అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇటీవలే ధ్రువీకరించారు. ‘వారు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.మరోవైపు.. ఫార్స్ న్యూస్ వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో పెజెష్కియాన్ కాలికి గాయమైంది. టెహ్రాన్ పశ్చిమ ప్రాంతంలోని ఓ భవనంపై ఈ దాడి జరిగింది. భవనం కింది భాగంలో ఇరాన్ అధికారులు ఉన్నారు. పేలుడు సంభవించగానే విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అత్యవసర వ్యవస్థలను ముందుగానే సిద్ధం చేసుకోవడంతో భవనంలోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

అమెరికాపై టారిఫ్‌లు నిలిపేసిన ఈయూ
బ్రస్సెల్స్: అమెరికా వస్తువులపై నేటి నుంచి అమల్లోకి రానున్న ప్రతీకార సుంకాలను యూరోపియన్ యూనియన్(ఈయూ) నిలిపివేసింది. ఆగస్టు ఒకటి నుంచి ఈయూ, మెక్సికోపై 30% కొత్త సుంకాలను ట్రంప్ ప్రకటించడంతో ఈయూ వెనుకడుగు వేసింది. ఈ నెలాఖరు నాటికి ట్రంప్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే ఆశతో ఉంది. ఇది చర్చలకు సమయమని యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లేయన్ అన్నారు. చర్చలు జరపడానికి ఆగస్టు మొదటి తేదీ వరకు తమకు సమయం ఉందన్నారు. ఒప్పందానికి రాలేకపోతే, ప్రతీకారానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు.

లండన్ సమీపంలో కూలిపోయిన విమానం
లండన్: యూకే రాజధాని లండన్‌కు 58 కిలోమీటర్ల దూరంలో సౌతెండ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం సాయంత్రం ఒక విమానం కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో తొమ్మిది మంది ప్రయాణి కులు, ఇద్దరు పైలట్లు ఉన్నట్లు తెలిసింది. అయితే, ప్రాణ నష్టం వాటిల్లిందా? అనే వివరాలు తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. తొలుత భారీ అగి్నగోళం, తర్వాత దట్టమైన నల్లటి పొగలు వెలువడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇది చాలా తీవ్రమైన ప్రమాదం అని పోలీసులు చెప్పారు. కూలిపోయింది చిన్నపాటి విమానమేనని తెలిసింది. సౌతెండ్ నుంచి నెదర్లాండ్స్‌లోని లెలీస్టడ్ సిటీకి బయలుదేరుతుండగా ఈ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయినట్లు సమాచారం.
జాతీయం

కబరస్తాన్ గేటు దూకి.. అమరులకు నివాళులర్పించి..!
శ్రీనగర్: శ్రీనగర్‌లోని నక్ష్ బంద్ సాహిబ్ కబరస్తాన్ వద్ద సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1931 జూలై 13న డోగ్రా ఆర్మీ జరిపిన కాల్పుల్లో చనిపోయిన 22 మంది సమాధులు ఇందులోనే ఉన్నాయి. ముఖ్యనేతలెవరూ ఇక్కడికి నివాళులరి్పంచడానికి రాకూడదని యంత్రాంగం సీఎం ఒమర్ సహా పలువురు నేతలను ఆదివారం గృహ నిర్బంధంలో ఉంచింది. అయితే, సోమవారం సీఎం ఒమర్ సహా పలువురు నేతలు అక్కడికి చేరుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఆటోలో, విద్యామంత్రి సకినా ఇట్టూ స్కూటీపై వచ్చారు. కబరస్తాన్‌కు దారి తీసే రెండు వైపులా దారుల్నీ అధికారులు మూసివేశారు. ఖన్‌య్రాŠ ప్రాంతానికి చేరుకున్న సీఎం ఒమర్ తన వాహనం దిగి అరకిలో మీటర్ దూరంలో ఉన్న కబరస్తాన్‌కు కాలినడకన చేరుకున్నారు. కబరస్తాన్‌కు తాళంవేసి ఉంచడంతో ఇనుప గేటు పైకెక్కి లోపలికి చేరుకున్నారు. కొందరు నేతలు కూడా ఆయన్ను అనుసరించారు. కొద్దిసేపటికి అధికారులు గేట్లు తెరిచారు. దీంతో, ఫరూక్ అబ్దుల్లా తదితరులు కూడా వచ్చి అమరుల కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ లెఫ్టినెంట్ మనోజ్ సిన్హా చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం గృహ నిర్బంధంలో ఉంచిన అధికారులు సోమవారం తనను ఎందుకు ఆపారంటూ మండిపడ్డారు. వాళ్లు మమ్మల్ని బానిసలని అనుకుంటున్నారు. కానీ, మేం ప్రజలు మాత్రమే సేవకులం. యూనిఫాంలో ఉన్న పోలీసులు చట్టం మర్చిపోతున్నారు. పరుగెత్తుతున్న మమ్మల్ని వెంటాడారు. మా చేతిలోని జెండాను చింపేయాలని చూశారు’అని ఆరోపించారు.

దర్యాప్తు నివేదికతో మరిన్ని అనుమానాలు
న్యూఢిల్లీ: గత నెలలో అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు అనంతరం మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ పేర్కొన్నారు. పైలట్ల సామర్థ్యాన్ని కొట్టిపారేయలేమన్న ఆయన.. విమానంలో మెకానికల్, మెయింటెనెన్స్‌కు సంబంధించిన లోపాలేవీ ఈ నివేదిక పేర్కొనలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఘటనపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘ప్రాథమిక నివేదిక విడుదలతోపాటు ఘటనకు దారి తీసిన పరిస్థితులు, కారణాలపై అదనంగా మరిన్ని వివరాలు వెల్లడవుతున్నాయి. ఇది మరింత స్పష్టతను, మరిన్ని ప్రశ్నలను లేవనెత్తడం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు’అంటూ ఆయన తమ సిబ్బందికి పంపిన అంతర్గత మెమోలో పేర్కొన్నారు. ఇంధన నాణ్యతలోగానీ, టేకాఫ్ ప్రక్రియలోగానీ తేడాల్లేవన్నారు. అదేవిధంగా, ఇద్దరు పైలట్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష కూడా జరిగిందన్నారు. ‘ప్రాథమిక నివేదికలో ప్రమాదానికి ఎలాంటి కారణం గుర్తించలేదు. ఎటువంటి సిఫారసులు చేయలేదు. పైపెచ్చు ఈ విచారణ ఇంకా కొనసాగుతోంది. అందుకే ఊహాగానాలకు తెరలేపవద్దు’అని కోరారు. తుది నివేదిక వెలువడే వరకు మరిన్ని సెనేషనల్ వార్తలు, వదంతులు వస్తాయనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించారు. ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ)శనివారం ప్రాథమిక నివేదిక విడుదల చేయడం తెల్సిందే. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం రెండు ఇంజన్ల ఫ్యూయల్ సప్లయ్ స్విచ్‌లు నిలిచినట్లు పైలట్ల మధ్య సంభాషణల ద్వారా వెల్లడైందని తెలిపింది. ఫ్యూయల్ స్విచ్‌లను తనిఖీ చేయించండి: డీజీసీఏ ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడమే అహ్మదాబాద్ ఘటనకు దారి తీసినట్లు తేలడంతో దేశీయ విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలక ఆదేశాలిచి్చంది. ఆయా సంస్థలు తమ బోయింగ్ 787, 737 రకం విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. కాగా ఎయిరిండియా ప్రమాద నివేదికలోని కీలక విషయాలను ప్రభుత్వం వెల్లడించకమునుపే వాల్‌స్ట్రీట్ జర్నల్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఎలా తెలిసిపోయాయని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రశ్నించారు.

ఈదుకుంటూ స్కూల్‌కు
ఖుంటి: ఆ గ్రామాన్ని కలిపే రహదారిపై వంతెన వర్షాలకు దెబ్బతింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కర్ర నిచ్చెనను ప్రమాదకరమంటూ అధికారులు తీసేశారు. అయినా ఆ బాలిక అధైర్యపడలేదు. చదువుకోవాలనే తపన ముందు అడ్డంకులన్నీ ఓడిపోయాయి. స్కూలు బ్యాగును నెత్తిపై పెట్టుకుని ఈదుకుంటూ నదిని దాటి తడిచి నీళ్లు కారుతున్న దుస్తులతోనే స్కూలుకు వెళుతోంది. ఆ గ్రామంలోని మిగతా పిల్లలందరిదీ ఇదే పరిస్థితి. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. రాంచీ–ఖుంటి–సిండెగా రహదారిలో పెలోల్ గ్రామాన్ని కలుపుతూ బనాయ్ నదిపై ప్రభుత్వం 2007లో రూ.1.30 కోట్లతో వంతెన నిర్మించింది. చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలకు ఆ వంతెనే ఆధారం. జూన్ 19వ తేదీన సంభవించిన వరద తీవ్రతకు వంతెన పిల్లర్ ఒకటి దెబ్బతింది. దీంతో, వెదురుకర్రలతో తాత్కాలికంగా వంతెనను ఏర్పాటు చేసుకుని గ్రామస్తులంతా పెలోల్ చేరుకుంటున్నారు. కానీ, ప్రమాదకరంగా ఉందంటూ అధికారులు ఆ నిచ్చెనను తొలగించారు. కానీ, పెలోల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న అంగర్బరీ గ్రామానికి చెందిన సునీత హొరొ(పేరు మార్చారు) మాత్రం ఏమాత్రం భయపడలేదు. నెత్తిపై స్కూల్ బ్యాగు పెట్టుకుని నదిలో ఈదుతూ ఆవలి ఒడ్డుకు చేరుకుంటోంది. తడిచిన దుస్తులకు బదులుగా బ్యాగులో అదనంగా సిద్ధంగా ఉంచుకున్న డ్రెస్‌ను వేసుకుని స్కూలుకు వెళ్లేంది. ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడూ ఇదే పరిస్థితి. దీంతో, వారంలో ఒకటీ రెండు సార్లు మాత్రమే స్కూలుకు వెళ్తున్నామని తెలిపింది. సునీత వచ్చే ఏడాది బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంది. ‘స్కూలుకెళ్లాంటే నదిలో కొంత భాగాన్ని ఈదటమే తప్ప మరో మార్గంలేదు. ఈదేటప్పుడు స్కూలు బ్యాగు నెత్తిపై పెట్టుకుంటా. కానీ, నా డ్రెస్ పూర్తిగా తడిచిపోతుంది. అందుకే, వచ్చేటప్పుడే ఎక్స్ ట్రా తెచ్చుకుంటా’అని ఆమె తెలిపింది. బోర్డు పరీక్షలకు ప్రిపరేరయ్యే తన స్నేహితులదీ ఇదే పరిస్థితని వివరించింది. సాధారణంగా ఐదంటే ఐదే నిమిషాలు పట్టే ప్రయాణానికి ఇప్పుడు 12 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని, 40 నిమిషాల సమయం తీసుకుంటోందని విద్యార్థులు అంటున్నారు. రాంచీ నుంచి సిండెగా మీదుగా ఒడిశా వెళ్లే భారీ వాహనాలు, బస్సులు సైతం వంతెన దెబ్బతినడంతో ప్రత్యామ్నాయం మార్గంలో వెళ్తున్నాయి. వంతెన వద్ద డైవర్షన్ రోడ్డు నిర్మించే పనిలో ఉన్నామని ఖుంటి సబ్ డివిజనల్ అధికారి దీపేశ్ కుమారి తెలిపారు. అయితే, ఆగకుండా కురుస్తున్న వానలతో పనులకు అవరోధం కలుగుతోందని చెప్పారు. జార్ఖండ్ సీఎంహేమంత్ సోరెన్వంతెన దెబ్బతినడంపై దర్యాప్తునకు ఆదేశించారు.

రహస్య రికార్డింగులు సాక్ష్యాలే
న్యూఢిల్లీ: జీవిత భాగస్వాములతో సంభాషణను రహస్యంగా రికార్డు చేయడం విడాకులతో పాటు అన్నిరకాల వైవాహిక వివాదాల్లోనూ సాక్ష్యాలుగా చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ధర్మాసనం సోమవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. సదరు సంభాషణలకు సాక్ష్యాల చట్టంలోని 122వ సెక్షన్ కింద రక్షణ ఉంటుందని, కనుక వాటిని న్యాయ వివాదాల్లో ఉపయోగించడాన్ని అనుమతించలేమని పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. వాటిని సాక్ష్యాలుగా అనుమతిస్తే వైవాహిక బంధాన్ని, కుటుంబంలో సామరస్యాన్ని దెబ్బతీస్తాయని, భాగస్వామిపై గూఢచర్యానికి దారి తీస్తాయని హైకోర్టు వెలువరించిన అభిప్రాయాలతో ధర్మాసనం విభేదించింది. ‘‘ఇలాంటివి చెల్లుబాటయ్యే వాదనలు కావన్నది మా అభిప్రాయం. భార్యాభర్తలు పరస్పరం తరచూ ఇలా సంభాషణను గుట్టుగా రికార్డు చేయడం వంటి పనులకు పాల్పడుతున్నారంటేనే ఆ బంధం బీటలు వారిందని, వారి మధ్య విశ్వాసం సన్నగిల్లిందని అర్థం. కనుక అలాంటి పరిస్థితుల్లో గోప్యంగా రికార్డు చేసిన భాగస్వామి తాలూకు సంభాషణను సాక్ష్యంగా అంగీకరించడం అసమంజమేమీ కాదు. ఎందుకంటే అది వైవాహిక సమస్యల తాలూకు ఫలితమే తప్ప వాటికి కారణం కాదు’’ అని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. ‘‘122వ సెక్షన్ పేర్కొంటున్న గోప్యత హక్కు భార్యాభర్తల సంభాషణలకు కూడా వర్తిస్తుందన్నది నిజమే. కానీ అది సంపూర్ణమైనది కాదు. ఈ అంశాన్ని ఆ సెక్షన్‌కు ఇచ్చిన మినహాయింపులతో కలిపి చూడాల్సి ఉంటుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఇలాంటి విషయాల్లో గోప్యత హక్కు కంటే కూడా సక్రమ విచారణ హక్కుదే పై చేయి అవుతుంది. వైవాహిక బంధం విచి్ఛన్నమయ్యే స్థితికి చేరినప్పుడు భాగస్వాములకు తమ వాదనను రుజువు చేసే సాక్ష్యాలు సమరి్పంచే హక్కును గోప్యత తదితరాలను ప్రాతిపదికగా చూపి కాలరాయలేం’’ అని స్పష్టం చేసింది. 2017 నాటి ఓ విడాకుల కేసులో భార్యకు తెలియకుండా భర్త జరిపిన ఆమె సంభాషణల రికార్డులను సాక్ష్యంగా అనుమతిస్తూ పంజాబ్‌లోని భటిండా ఫ్యామిలీ కోర్టు ఇచి్చన తీర్పును పునరుద్ధరించింది.
ఎన్ఆర్ఐ

దుబాయ్‌లో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఈనెల 8న దుబాయ్‌లోని కరామా పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. యుఏఈ వైయస్సార్సీపీ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సయ్యద్ అక్రమ్, అరుణ్ చరవర్థి, ప్రేం, యండ్రా సేను, షేక్ అబ్దుల్లా కీలకంగా వ్యవహరించారు. వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పణతో కార్యక్రమాన్నిప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి మహానేత సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా కార్మికులకు అన్నదానం చేశారు. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్సార్ సేవా తత్వాన్ని గౌరవంగా స్మరించుకున్నారు.ఈ సందర్భంగా సయ్యద్ అక్రమ్, అరుణ్ చరవర్థి మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ సామాజిక న్యాయం, సంక్షేమాన్ని సమన్వయం చేసిన అజరామర నాయకుడని కొనియాడారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చిన నాయకుని సేవలను సేవా కార్యక్రమాల ద్వారా గుర్తుచేసుకోవడం గర్వకారణమని అన్నారు.ప్రధాన, గౌరవ అతిథులు డాక్టర్ ఖాజా అబ్దుల్ ముత్తలిబ్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & ప్రైవేట్ అడ్వైజర్ — H.H. శైఖా సలామా తహ్మూన్ అల్ నాహ్యాన్ కార్యాలయం – యుఏఇ), నజీరుద్దీన్ మహమ్మద్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, Spread Kindness) హాజరయ్యారు. పి. రావు, అబ్దుల్ ఫహీమ్, షోయబ్, అబ్దుల్ రఫీక్, షామ్, ఘానీ, సిరాజ్, షేక్ సమీర్, రవి, పిల్లి రవి, కె. ప్రసాద్, జో బాబు, కిషోర్, బాబ్జీ, ప్రభాకర్, చిట్టి బాబు, నరేశ్, మహిళా సభ్యులు.. శాంతి, రాణి, ప్రభావతి, చిన్ని, విజయ, మేరీ, రాజేశ్వరి, సునీత, వనిత, కమల, భారతీ తదితరులు పాల్గొన్నారు.డాక్టర్ వైఎస్సార్ సేవా విలువలు, ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్న సంకల్పంతో.. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా కొనసాగిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.వైఎస్సార్ వల్లే ఎదిగా..డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో లబ్ధి పొంది దుబాయ్‌లో స్థిరపడిన షేక్ సమీర్ ఈ సందర్భంగా తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ''ఫీజు రీయింబర్స్మెంట్ వల్లే నేను ఇంజినీరింగ్ చదవగలిగాను. ఈ విద్యార్హత ఆధారంగా ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్‌జెమినీ, డెలాయిట్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేశాను. ఆరోగ్యం, టెక్నాలజీని కలిపే వినూత్న ఆలోచనతో ఏఐ ఆర్కిటెక్ట్, Fit Techies LLC అనే సంస్థను స్థాపించి నడుపుతున్నాను. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఫిట్నెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి బోధిస్తున్నా. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నా జీవితాన్ని మార్చింది. నేను విద్యార్థి నుంచి మార్గదర్శకుడిగా మారిన ప్రయాణానికి ఇది మూలకారణం” అన్నారు సమీర్.

ఘనంగా ముగిసిన నాట్స్ 8వ తెలుగు సంబరాలు
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో 8వ నాట్స్ తెలుగు సంబరాలు వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సంభరాల్లో వేలాదిమంది తరలి వచ్చారు.....వేదిక ప్రాంగణం తెలుగువాళ్ళతో క్రిక్కిరిసిపోయింది. మహాసభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, ఈ తెలుగు సంబరాలు విజయవంతానికి కృషి చేశారు.అంతే కాక సంబరాల కమిటీ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, చైర్, కో చైర్, టీం మెంబర్లు, విజయవంతానికి కృషి చేశారు. ఈ తెలుగు సంబరాల్లో నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, అల్లు అర్జున్, శ్రీలీల తో పాటు అలనాటి నటీమణులు జయసుధ, మీనా సందడి చేసారు...థమన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసారు సంబరాలకు వచ్చిన వారిని ఉర్రుతలూగించారు...తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేల నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా ఈ తెలుగు సంభరాలు అంభరాన్ని అంటాయి...నాట్స్ తెలుగు సంబరాల కోసం సైనికుల్లా పని చేసిన ప్రతి ఒక్కరికి... హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నాట్స్ కమిటీ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ......ఈ వేడుకలకు వచ్చిన అతిధులకు, కమ్యూనిటీకి, కళాకారులకు, సహకరించిన వలంటీర్లు అందరికీ నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ ధన్యవాదాలుతెలియజేశారు...ఇది మన తెలుగు సంబరం జరుపుకుందాం కలిసి అందరం అనే నినాదం ప్రారంభమైన ఈ సంభరాల్లో 20 వేల మందికి పైగా హాజరయ్యారు...నాట్స్ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, సెక్రెటరీ మల్లాది శ్రీనివాస్చక్కని ప్రణాళిక, సమన్వయంతో తమ సత్తా చాటారు..సంబరాలే కాక సామాజిక బాద్యత గా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి నాట్స్ 85లక్షల విరాళం అందజేసింది. ఈ విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు.. నాట్స్ లీడర్ షిప్ అందజేశారు. నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.. అనేక సాంస్కృతిక సామాజిక సేవ కార్యక్రమాలు సైతం విజయవంతంగా నిర్వహించారు..

శ్రీ సాంస్కృతిక కళాసారథి 5వ వార్షికోత్సవం, గురుపూర్ణిమ శుభాకాంక్షలు
గురుపూర్ణిమ నాడు ప్రారంభమైన శ్రీ సాంస్కృతిక కళాసారథి ఈ రోజు తన 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. గత ఐదేళ్లయేటట తాము చేపట్టిన ప్రతి అడుగులో, మీరు అందించిన ఆదరణ, ఆశీర్వాదాలు, ప్రోత్సాహం తమకు బలాన్నిచ్చాయని పేర్కొంది. ‘‘ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి, మాకు తోడుగా నిలిచిన సభ్యులకు,మార్గనిర్దేశం చేసిన మేధావులకు, మన ఆహ్వానాన్ని స్వీకరించి అలంకరించిన అతిథులకు, తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులకు, స్పందించిన ప్రేక్షకులకు, సమయానుకూలంగా విరాళాలు అందించిన దాతలకు, ఆశీర్వచనాలు, అభినందనలు తెలియజేసిన మిత్రులకు, మా కార్యనిర్వాహక వర్గం తరఫున శిరస్సువంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.’’అని ప్రకటనలో వెల్లడించింది. ఎనలేని సంపదలాంటి ఈ సహకారం ఇక ముందు కూడా కొనసాగాలని అభిలషించింది.అదే శక్తితో, భవిష్యత్తులో మరిన్ని నాణ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చింది. అలాగే ఇప్పటివరకూ మా సంస్థ నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమాల సంగ్రహాన్ని వీడియో రూపంలో తీసుకొచ్చింది.

8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా
టంపా: ఫ్లోరిడా: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గణపతి పూజలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అమెరికా తెలుగు సంబరాలను బాలకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా అమెరికా తెలుగు సంబరాలను నిర్వహిస్తున్నందుకు నాట్స్ సంబరాల కమిటీని ఆయన అభినందించారు. అమెరికాలో తెలుగు వారి కోసం నాట్స్ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. తెలుగు భాష పరిరక్షణలో నాట్స్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఇప్పటివరకు మూడు సార్లు నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాలు పంచుకున్నానన్నారు.హంసవింశతి పుస్తకం ఆవిష్కరణ18వ శతాబ్ధంలో ప్రముఖ తెలుగు కవి అయ్యలరాజు నారాయణ రచించిన హంసవింశతి కావ్యాన్ని తనికెళ్ల భరణి నేటి తరం కోసం ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. సంబరాల వేదికపై నందమూరి బాలకృష్ణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాష మాధుర్యాన్ని ఎందరో కవులు తమ రచనల్లో ప్రతిబింబించారని బాలకృష్ణ అన్నారు. భావితరాలకు తెలుగు మాధుర్యాన్ని అందించేందుకు నేటి తరం వారు తెలుగులో మాట్లాడాలని, తెలుగు రచనలను పిల్లలకు పరిచయం చేయాలన్నారు.పద్యం, అవధానం తెలుగు భాషకే సొంతమైన అమూల్యమైన ఆభరణాలని ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ల భరణి అన్నారు.. తెలుగు భాషా మాధుర్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని భరణి పేర్కొన్నారు. తెలుగులో ఎన్సైక్లోపీడియా లాంటి పుస్తకం హంసవింశతి అని తెలిపారు.. దీనిని ప్రతి తెలుగువాడు చదవితే మన చరిత్రలో మనకు తెలియని సరికొత్త విషయాలు తెలుస్తాయని భరణి అన్నారు. 8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, ఏపీటీఎస్ చైర్మన్ మోహనకృష్ణ మన్నవతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

ముందే చెబుతున్నా, న్యాయం జరగకపోతే..!
హృదయవిదారకమైన ఒడిషా బాలాసోర్ బీఈడీ సెకండియర్ స్టూడెంట్ సూసైడ్ కేసులో షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. హెచ్‌వోడీ లైంగిక వేధింపుల పర్వాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు చేసిన కాపీ.. అందులో పేర్కొన్న విషయాలు బయటకు వచ్చాయి. బాలాసోర్ బీఈడీ విద్యార్థిని బలవన్మరణం కేసులో విస్తుపోయే విషయం వెలుగు చూసింది. నిప్పంటించుకునే పది రోజుల ముందు.. 22 ఏళ్ల బాధిత విద్యార్థిని సీఐసీసీ(college's internal complaints committee)కి ఫిర్యాదు చేసింది. అందులో సీనియర్ ఫ్యాకల్టీ నుంచి తనకు ఎదురైన ఇబ్బందులను ప్రస్తావిస్తూనే.. చర్యలు తీసుకోకుంటే గనుక ప్రాణం తీసుకుంటానని హెచ్చరించింది కూడా. జులై 1వ తేదీన ఆమె రాసిన లేఖలో ఇలా.. గత కొన్ని నెలలగా బీఈడీ డిపార్ట్మెంట్ హెచవోడీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సమీర్ కుమార్ సాహూ నన్ను వేధిస్తున్నారు. తక్కువ మార్కుల వేస్తానని, నన్ను ఫెయిల్ చేస్తానని.. నా గురించి నా కుటుంబంతో లేనిపోనివి చెబుతానని బెదిరిస్తూ వస్తున్నారు. అన్నింటికి మించి తన కోరికెలు తీర్చమంటూ వేధిస్తున్నారు. మనశ్శాంతి కరువై మానసికంగా ఇబ్బంది పడుతున్నా. నా ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే.. నేను బలవన్మరణానికి పాల్పడతాను. నా చావుకు హెచ్‌వోడీ, కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని లేఖ రాసిందామె. జూన్ 30వ తేదీన ఫకీర్ మోహన్ కాలేజీ ప్రిన్సిపల్ దీలీప్ ఘోష్ దృష్టికి ఆమె విషయాన్ని తీసుకెళ్లింది. ఆ మరుసటిరోజు ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదును సమర్పించింది. అంతటితో ఆగకుండా.. పది రోజులపాటు ఆ ఫిర్యాదు కాపీని సోషల్ మీడియాలో పోస్టు చేసి చర్యలు తీసుకోవాలంటూ సీఎం, విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేను ట్యాగ్చేసి మరీ కోరింది. అయినా ఫలితం లేకపోయింది. జులై 12వ తేదీన.. ఆమె కాలేజీలోని ప్రిన్సిపల్ గది ఆవరణలో నిప్పటించుకుంది. 95 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఆమెను రక్షించడానికి వెళ్లిన మరో విద్యార్థిని కూడా 70 శాతం గాయాలపాలై చికిత్స పొందుతోంది. ప్రధాన బాధితురాలిని బాలాసోర్ జిల్లా ఆస్పత్రిలో.. ఆపై భువనేశ్వర్‌లో ఎయిమ్స్‌కు ఆమెను తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాధితురాలు కన్నుమూసింది. ఈ కేసుకు సంబంధించిన బీఈడీ హెచ్‌వోడీ సమీర్ కుమార్ సాహూ, కాలేజీ ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్‌లను కాలేజీ యాజమానయం తొలగించగా.. ఆపై పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఉదయం బాలాసోర్‌లోని బాధితురాలి స్వగ్రామం పలాసియాకు మృతదేహాన్ని తరలించారు. ఊరు ఊరంతా ఆమె మృతదేహం చూసి కన్నీరు పెట్టుకుంది. ఆమె మృతదేహాంతో కాసేపు రోడ్డుపై ఆందోళనకు దిగింది.ఈ ఘటనపై సీఎం మోహన్ చరణ్ మజ్హీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారాయన. మరోవైపు.. స్వరాష్ట్రం ఒడిశా పర్యటనలో ఉన్నరాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సోమవారం సాయంత్రం AIIMSకి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆపై కాసేపటికే ఆమె కన్నుమూయడం గమనార్హం.ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు వినవస్తున్నాయి. ఆమెది ఆత్మహత్య కాదు.. బీజేపీ వ్యవస్థ చేసిన హత్య అని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బాధితురాలిని రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్న రాహుల్.. బాధిత విద్యార్థిని ధైర్యంగా తన గొంతుక వినిపించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: నేనేం చావడానికి ఇక్కడికి రాలేదు!

అద్దె కారుతో భర్తను లేపేసిన భార్య..!
మోటకొండూర్: మోటకొండూర్ మండలం కాటేపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని మృతుడిని అతడి భార్య, బావమర్ది కలిసి హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎస్ఐ నాగుల ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36), తన స్నేహితుడు మద్దికుంట వీరబాబు ఆదివారం అర్ధరాత్రి భువనగిరి మండలం రాయిగిరి నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా.. మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుండి వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ను కారు కొద్దిదూరం లాకెళ్లడంతో స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ వెనుక కూర్చున్న వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. స్వామి మృతదేహాన్ని, గాయపడిన వీరబాబును స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరబాబును మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా సోమావరం ఉదయం మృతుడు స్వామి బాబాయి ఐలయ్య ఈ ప్రమాదంపై పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ మోటకొండూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు ఇది రోడ్డు ప్రమాదం కాదని.. వివాహేతర సంబంధం కారణంగానే స్వామిని అతడి భార్య స్వాతి, స్వాతి సోదరుడు మహేష్ కలిసి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని ఎస్ఐ తెలిపారు. మృతుడు స్వామికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు.

42 ఏళ్ల లారీడ్రైవర్‌తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!
వరంగల్: అతడికి పెళ్లయ్యింది.. ఇద్దరు పిల్లలు. యువతి డిగ్రీ చదువుతుంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం.. చివరికి వారి ప్రాణమే తీసింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ఏనుమాముల ఇందిరా కాలనీ ఫేజ్–2కు చెందిన వేల్పుగొండ స్వామి(42).. ఎలిశాల గాయత్రి (22) పక్కపక్కనే ఉంటారు. కుమారస్వామికి భార్య, ఇద్దరు పిల్లలు. ఒకరు తొమ్మిది, మరొకరు ఏడో తరగతి చదువుతున్నారు. లారీడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి పక్కనే ఉంటున్న గాయత్రి నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. వీరిద్దరికి మూడేళ్లక్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. స్వామికి.. గాయత్రిని వదిలేసి భార్యా, పిల్లలతో ఉండాలనే ఆలోచన వచ్చింది. విషయం గాయత్రికి తెలపగా, అందుకు అంగీకరించలేదు. ‘నువ్వు నాతోనే ఉండాలి.. మనమిద్దరం వివాహం చేసుకుందాం’ అని తెలిపింది. ఈ విషయంలో స్వామి తన భార్యను ఒప్పించాలని ప్రయత్నించినప్పటికీ ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించింది. దీంతో స్వామి ఏంచేయలేక భార్యను చికిత్స కోసం ఈనెల 2న ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడే వదిలేసి మళ్లీ వస్తానని వెళ్లాడు. రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో 4న మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో స్వామిపై మిస్సింగ్ కేసు నమోదైంది. గాయత్రి ఈనెల 2నుంచి కనిపించడం లేదని ఆమె తండ్రి కుమారస్వామి 3న ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. వీరిద్దరు 2న ఇంట్లో నుంచి పారిపోయారు. తిరిగి ఇంటికెళ్తే ఇబ్బందవుతుందని, కలిసి చని పోదామని నిర్ణయించుకుని ఆదివారం ఉద యం పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామానికి చేరుకుని గడ్డిమందు తాగారు. గమనించిన స్థానికుడు పవన్‌కళ్యాణ్ ఫోన్ ద్వారా వారి బంధువులకు సమాచారం అందించి ఇద్దరిని 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందారు. మృతుడి అన్న యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ తెలిపారు.

హైదరాబాద్: పార్క్‌లో కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో కాల్పుల కలకలం రేగింది. మార్నింగ్ వాకర్స్‌పై దుండగులు కాల్పులు జరిపారు. శాలివాహన నగర్ పార్క్‌లో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వాకింగ్ చేస్తున్న సమయంలో చందు నాయక్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరపగా.. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.చందు నాయక్ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వాసిగా పోలీసులు గుర్తించారు. కాల్పులకు భూ వివాదమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో నలుగురు వ్యక్తులు.. చందు నాయక్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. మృతుడిపై కారం చల్లి.. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇసుక రేణువుల్లో ఉన్న బుల్లెట్స్ కోసం పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. మృతుడు చందును చంపుతున్న క్రమంలో అడ్డొచ్చిన వారిని దుండగులు గన్‌తో బెదిరించారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. గన్స్‌లో ఉన్న బుల్లెట్స్‌ను పరిశీలించిన క్లూస్ టీమ్.. నమూనాలను ల్యాబ్‌కి పంపించారు. నిందితుల కార్ నెంబర్ ఆధారంగా పోలీసులు ట్రాక్ చేస్తున్నారు.సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యకుమార్ కాల్పుల ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘‘ఉదయం 7:30 గంటలకు ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయని సమాచారం వచ్చింది. చందు నాయక్ అనే వ్యక్తి వాకింగ్ చేస్తుండగా నలుగురు దుండగులు వచ్చి కాల్పులు జరిపారు. షిఫ్ట్ కార్ లో వచ్చి నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారని స్థానికులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.నిందితుల కోసం 10 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాం. స్పాట్లో 7 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించాం. స్పాట్లో దొరికిన బుల్లెట్లను చూస్తే ఒకే వెపన్తో ఫైరింగ్ చేసినట్టు ఉన్నాయి. 2022లో జరిగిన హత్య కేసులో చందు నాయక్ నిందితుడిగా ఉన్నాడు. కాగా, ఈ కాల్పుల ఘటనలో ఎస్వోటీ పోలీసుల ఎదుట నలుగురు లొంగిపోయారు. ఐదుగురి మధ్య ఆర్థిక లావాదేవీలే చందునాయక్ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతుడు చందునాయక్‌తో పాటు ఈ నలుగురు ఓ హత్య కేసులో నిందితులు.