
మతం పేరిట మారణహోమం అనైతిక చర్య
పరకాల కోర్టు జూనియర్ సివిల్ జడ్జి
శాలిని లింగం
పరకాల: జమ్మూకశ్మీర్ పహల్గంలో పర్యాటకులను మతం పేరిట కాల్చిచంపిన సంఘటన తీవ్రంగా కలిచివేసిందని, పర్యాటకులపై దాడిచేసిన ఉగ్రవాదులను భారత ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని పరకాల కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శాలిని లింగం కోరారు. ఉగ్రవాదుల చేతిల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి గురువారం పరకాల కోర్టులో కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. జడ్జి శాలిని లింగం మాట్లాడుతూ మతం పేరిట అమాయకులను కాల్చిచంపడం అవివేకమన్నారు. అలాంటి దుర్మార్గులు కఠినమైన శిక్ష ఎదుర్కొంటారన్నారు. ఈ ఘటన యావత్తు ప్రపంచాన్ని కలిచివేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెండ్యాల భద్రయ్య, ఏజీపీ లక్కం శంకర్, సీనియర్ న్యాయవాదులు పున్నం రాజిరెడ్డి, ఓంటేరు రాజమౌళి, వి.చంద్రమౌళి, గండ్ర నరేష్‌రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.