అరంగేట్రంతోనే సంచలనం సృష్టించి ఇతర నెట్ వర్క్ లకు కోలుకోలేని దెబ్బ తీసిన రిలయన్స్ జియో.. మరో సంచలనాకి సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఉచిత డేటా, కాలింగ్ తదితర ఆఫర్లతో రికార్డ్ స్థాయిలో వినియోగదారులను సొంతంచేసుకున్న జియో.. తాజాగా మరోమారు ఇతర కంపెనీలను దెబ్బ కొట్టే వ్యూహంతో పావులు కదుపుతోంది. దేశంలో 5జీ సేవలను అందించేందుకు జియో మరో ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ తో జతకట్టింది. మొబైల్ వరల్డ్ 2017 సమావేశంలోని ఒక క్లోజ్డ్ ఈవెంట్ లో ఈ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో శాంసంగ్ 5జీ సేవల హోం రౌటర్, రేడియో బేస్ స్టేషన, 5 జీ మోడం చిప్ సెట్‌లను ఇదే సమాశాల్లో లాంచ్ చేయడం విశేషం.