ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నల్లగొండ జిల్లా వైపు దృష్టి సారించారా..? అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహం రచించారా? అందుకోసం వచ్చే ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి కూడా పోటీ చేయాలని భావిస్తున్నారా..? తద్వారా ఆ జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్ నేతలకు చెక్ పెట్టవచ్చనీ యోచిస్తున్నారా..!?.. నాలుగైదు రోజులుగా నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్న అంశమిది.