అన్నాడీఎంకే ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పడుతున్న అష్టకష్టాలను పరిగణలోకి తీసుకుని బలనిరూపణలో సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి డీఎంకే శాసనసభాపక్షం నిర్ణయించింది. పరిస్థితిని బట్టి తమ అడుగులు ఉంటాయని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రకటించారు. అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ పరిణామాల్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు స్టాలిన్ తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని కూల్చడమా, పరిస్థితిని బట్టి అధికార పావులు కదపడమా, లేదా మళ్లీ ఎన్నికలకు వెళ్లడమా అన్న వ్యూహాలతో స్టాలిన్ అడుగులు సాగుతున్నాయి.