విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వాధికారుల జరిపిన చర్చలు ఫలించలేదు. దాంతో సమ్మె కొనసాగుతోంది. కాగా తమ చర్చలు ఇంకా ముగియలేదని, డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన రాలేదని విద్యుత్ జేఏసీ కో ఛైర్మన్ సీతారాంరెడ్డి తెలిపారు. అంతవరకూ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.