ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించినవారు ఎవరూ లేదన్నారు. 'ఏపీకి ప్రత్యేక హోదా' సదస్సులో ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బాబు పూర్తిగా అటకెక్కించారని అన్నారు. అన్ని విషయాల్లోనూ ప్రజలను దగా చేశారని రఘువీరా మండిపడ్డారు. అందుకే టీడీపీ చేసుకోవాల్సింది మహానాడు కాదని, దగానాడు అని ఆయన అన్నారు.