ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోసం చేశారని, అందుకే తెలంగాణలో ఆ పార్టీ ఉనికి లేకుండా పోయిందని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. వాస్తవాలను గమనించకుండా విపక్షాలు మాట్లాడుతున్నాయంటూ ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత పైడిపల్లి రవీందర్ రావు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈసారి ఆదిలాబాద్ జిల్లాలో 70వేల ఎకరాలకు నీళ్లిచ్చామని, బంగారు భూములు ఉన్న ఆదిలాబాద్‌లో అద్భుతాలు జరగబోతున్నాయని అన్నారు.