వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు నుంచి రూ.20 పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన సోమవారం పర్యటించారు. అనంతరం వైఎస్ జగన్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారని, అయితే అంతకంటే ఎక్కువే నష్టం జరిగి ఉండచ్చొన్నారు. గతేడాది ఇన్పుట్ సబ్సిడీ ఇంకా ఇవ్వలేదని, రైతులకు రుణమాఫీ కాలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.