దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేని లోటు వైఎస్‌జగన్ తీరుస్తారని వైఎస్ విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ను జనం ఇంకా మరిచిపోలేదనీ.. వైఎస్ జగన్ పేరు చెబితే.. కూడా మంచి స్పందన వస్తోందని విజయమ్మ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు తమకు మంచి చేస్తాడని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. ప్రజల్లో ఆ నమ్మకాన్ని జగన్ కలిగించుకున్నాడని అన్నారు. అందుకే జగన్‌కు ఓ అవకాశం ఇవ్వమని అడుగుతున్నానని.. ప్రజలు కూడా ఇవ్వాలనే అనుకుంటున్నారని తెలిపారు.