వేములవాడలోని రాజన్న దేవాలయం లడ్డూ విభాగం సూపరింటెండెంట్ నామాల రాజేందర్ ఇంట్లో గురువారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని వచ్చిన ఆరోపణల నేపధ్యంలో రాజేందర్ ఇంట్లోనేగాక వేములవాడలోగల ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఐదు చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నారు.