రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు పేద ప్రజల భూములను దోచుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రూ. వేలకోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇంతకాలం చేసిన దోపిడీ చాలక.. ఇప్పుడు అమాయక రైతును రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మి మోసపోవద్దని రైతును కోరారు. అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులు నిరసనలు విరమించాలని కోరారు