ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యంకాదని, అందుకే సాయం చేస్తామని కేంద్రం చెప్పినట్టు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మాట ఇచ్చారు కాబట్టే ఆ మాటపై నిలబడ్డామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు తలూపిన చంద్రబాబు ఇప్పుడెందుకు కొత్తపాట పాడుతున్నారని ప్రశ్నించారు.