మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తుండగా నక్కా వెంకట్రావు అనే వ్యక్తిని ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ వాసి అయిన వెంకట్రావు అర్బన్ నక్సలిజం వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడని... అతడిని అరెస్టు చేయడం ద్వారా అర్బన్ నక్సల్స్ నెట్వర్క్ను బ్రేక్ చేశామని ఛత్తీస్గఢ్ ఐజీ ఎస్పీ సింగ్ తెలిపారు.