మహారాష్ట్రలో రెండు వారాలకు పైగా నెలకొన్న రాజకీయ అనిశ్చితిలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఆదివారం సాయంత్రం వేగంగా పరిణామాలు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు విముఖత చూపింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ బీజేపీని శనివారం గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ వెనకడుగు వేయడంతో కొత్త రాజకీయ సమీకరణాలు ఊపందుకుంటున్నాయి.