అత్తింటివారితో పాటు కట్టుకున్న భార్య వేధింపుల వల్లే తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుమంత్‌రెడ్డి సోదరుడు శ్రావణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో సమంత్‌రెడ్డి అనే సాఫ్‌వేర్ ఉద్యోగి నిన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నంకు చెందిన యువతితో సమంత్‌రెడ్డికి వివాహమైంది. పెళ్లయిన నాలుగు నెలలకే సుమంత్‌రెడ్డి ఆత్మహత్యచేసుకున్నాడు.