నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వనపర్తి వెళ్తుండగా ముందు టైరు పేలి రోడ్డు పక్కకు అకస్మాత్తుగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి.