సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతికి సంబంధించి పిటిషన్లలో లేవనెత్తిన అంశాలు చాలా తీవ్రమైనవని, అన్ని పత్రాల్ని చాలా క్షుణ్నంగా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. లోయా మృతిపై సమగ్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ ప్రారంభించింది.