తెలంగాణలో ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందే రాజకీయాలు వేడెక్కాయి. తమ ఎమ్మెల్యేలను లాగేసే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రారంభించిందని టీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక వేళ హంగ్ వస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని తమ ఎమ్మెల్యేలకు ఫోన్‌లు చేసి ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తోందని ఆపద్ధర్మ మంత్రి లక్ష్మా రెడ్డి అన్నారు.