పెద్ద నోట్లు రద్దు అయి ఏడాది కావొస్తోంది.. హఠాత్తుగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించిన నవంబర్ 8న విపక్షాలు బ్లాక్ డేగా నిర్వహించాలని చూస్తుండగా... మోదీ ప్రభుత్వం దీన్ని 'యాంటీ-బ్లాక్ మనీ' డేగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఇటు ప్రభుత్వం, అటు విపక్షాలు ఎవరెన్ని చేసినా.. నెటిజనులు మాత్రం హాలిడే కావాలంటున్నారు. తమకు పబ్లిక్ హాలిడే దొరుకుతుందా అంటూ ట్విటర్ యూజర్లు గడుసుగా అడుగుతున్నారు. అంతేకాక నవంబర్ 8న నేషనల్ హాలిడే ప్రకటించడం అద్భుతమైన ఐడియా అంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు.