దారుణ హత్యకు గురైన తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. శుక్రవారం సాయంత్రం పులివెందులలోని వైఎస్ వివేకానందరెడ్డి స్వగృహానికి చేరుకున్న వైఎస్ జగన్ ముందుగా నివాళి అర్పించి, అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.