వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నవంబర్ 6 నుంచి చేయతలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో పలువురు పార్టీ నేతలు శనివారం ఏపీ డీజీపీ సాంబశివరావును కలిశారు. సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పార్థసారథిలు.. ప్రజా సంకల్పయాత్రకు సంబంధించిన పలు వివరాలను డీజీపీకి అందజేశారు.